NTV Telugu Site icon

Anupama : తనని ట్రోల్ చేసిన నెటిజెన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అనుపమ..!!

Whatsapp Image 2023 06 11 At 6.43.53 Pm

Whatsapp Image 2023 06 11 At 6.43.53 Pm

అనుపమ పరమేశ్వరన్ మలయాళీ ముద్దుగుమ్మగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.ఈమె తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.ప్రస్తుతం వరుస సినిమాల లో నటిస్తూ బాగా బిజీగా ఉన్న అనుపమ పరమేశ్వరన్ నిఖిల్ సరసన నటించిన కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో భారీ సక్సెస్ ను అందుకుంది . ఈ సినిమా తర్వాత తిరిగి నిఖిల్ తో కలిసిన నటించిన 18 పేజెస్ సినిమా ను కూడా చేసింది.ఈ సినిమా కూడా కార్తికేయ 2 అంత కాకపోయినా ఓకే అనిపించింది.

ప్రస్తుతం రవితేజ సినిమా తో పాటు సిద్ధూ జొన్నలగడ్డ తో టిల్లు స్క్వేర్ సినిమాలో కూడా నటిస్తూ చాలా బిజీగా ఉన్నారు.అనుపమ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ఇలా సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటుంది.ఈమెను తాజాగా ఒక నెటిజన్ ట్రోల్ చేసాడు.. ఇలా అనుపమ ను ఉద్దేశిస్తూ ఒక నెటిజన్ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తూ నువ్వేమీ పెద్ద హీరోయిన్ మెటీరియల్ కాదంటూ కామెంట్ ను చేసాడు. నువ్వేమీ పెద్ద హీరోయిన్ కాదు అందుకే నీకు పెద్ద పెద్ద సినిమాలలో అవకాశాలు రావట్లేదు.అసలు మీరు హీరోయిన్ మెటీరియలే కాదు అంటూ దారుణంగా అయితే కామెంట్ చేశాడు.. అయితే నేటిజన్ చేసిన ఈ కామెంట్ పై అనుపమ స్పందిస్తూ చాలా కూల్ గా అయితే సమాధానం చెప్పింది.ఈ సందర్భంగా అనుపమ స్పందిస్తూ .. మీరు చెప్తుంది కరెక్టే బ్రదర్ . నేను హీరోయిన్ టైప్ కాదు.. నేను యాక్టర్ టైప్ అని అనుపమ చెప్పిన ఈ సమాధానంతో సదరు నెటిజన్ ఫ్యూజ్ ఎగిరిపోయింది.దీంతో పలువురు అనుపమకు మద్దతు తెలుపుతున్నారు.అనుపమ ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి.ఆ నెటిజన్ కు సరైన సమాధానం ఇచ్చావు అంటూ ఆమెను మద్దతు పలుకుతున్నారు అనుపమ ఫ్యాన్స్..

Show comments