Site icon NTV Telugu

The Kashmir Files controversy : నిజాలు బయట పెట్టిన సీనియర్ నటుడు

The-Kashmir-Files

The Kashmir Files… ఎక్కడ చూసినా ఈ సినిమా సందడే కన్పిస్తోంది ఇప్పుడు. ఈ హిందీ సినిమా కథనానికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. వస్తావా ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అయితే బాలీవుడ్ లో పాపులర్ అయిన “ది కపిల్ శర్మ” షో నిర్మాతలు కాశ్మీర్ ఫైల్స్‌ను ప్రమోట్ చేయడానికి నిరాకరించారని చిత్రనిర్మాత వివేక్ అగ్నిహోత్రి పేర్కొన్నప్పటి నుండి, హాస్యనటుడు కపిల్ శర్మని సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు నెటిజన్లు. వాస్తవానికి ఈ చిత్రంలో ప్రముఖ తారలు లేకపోవడంతో దానిని ప్రమోట్ చేయడానికి వారికి ఆసక్తి లేదని అగ్నిహోత్రి ఆరోపించడంతో నెటిజన్లు ట్విట్టర్‌లో కపిల్ శర్మ షోను నిందించడం ప్రారంభించారు. దీంతో ఏకపక్ష కథనాలను నమ్మవద్దని కపిల్ శర్మ వివరణ ఇవ్వగా, The Kashmir Filesలో నటించిన సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ ఇప్పుడు ఈ విషయంపై తన మౌనాన్ని వీడారు. ఆయన తాజా ఇంటర్వ్యూలో కపిల్‌ను సమర్థించాడు.

Read Also : Bigg Boss Non Stop : నామినేషన్లలో 12 మంది… పక్కపక్కనే ఉంటూ గోతులు…

దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తన షోలో The Kashmir Files టీంను ఆహ్వానించడానికి ఆ హాస్యనటుడు నిరాకరించాడని ట్వీట్ చేయడంతో కపిల్ శర్మపై మండిపడ్డారు. ఓ నేషనల్ మీడియాతో మాట్లాడిన అనుపమ్ ఖేర్… సినిమాను ప్రమోట్ చేయడానికి రెండు నెలల క్రితం కపిల్ శర్మ షోకి తనను ఆహ్వానించారని ఇప్పుడు స్పష్టం చేశారు. అయితే సినిమా స్వరూపం కాస్త సీరియస్‌గా ఉండటంతో ఆయనే తిరస్కరించారట. అందుకే అనుపమ్ కామెడీ షోలో భాగం కావాలనుకోలేదట. అంతేకానీ కపిల్‌కి మా పట్ల లేదా సినిమా పట్ల ఎలాంటి ద్వేషం లేదు అని అనుపమ్ అన్నారు. ఇక The Kashmir Files controversyకి ముగింపు పలికినందుకు కపిల్ శర్మ అనుపమ్ ఖేర్ కు కృతజ్ఞతలు తెలిపారు.

Exit mobile version