Anumana Pakshi Trailer: డీజే టిల్లు డైరెక్టర్ నుంచి మరో క్రేజీ కామెడీ.. నవ్వులు పూయిస్తున్న రాగ్ మయూర్ క్యారెక్టరైజేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anumana Pakshi Trailer: ‘డీజే టిల్లు’తో టాలీవుడ్లో తనదైన కామెడీ మార్క్ చూపించిన దర్శకుడు విమల్ కృష్ణ ఇప్పుడు మరో డిఫరెంట్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. రాగ్ మయూర్ హీరోగా తెరకెక్కిన ‘అనుమాన పక్షి’ ట్రైలర్ తాజాగా విడుదలై సినిమాపై అంచనాలు పెంచుతోంది. ప్రతి చిన్న విషయాన్ని అనుమానిస్తూ, అతిగా ఆలోచిస్తూ తన జీవితాన్ని తానే కన్ఫ్యూజ్ చేసుకునే ఓ వ్యక్తి చుట్టూ కథను నడిపించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
ఈ సినిమాలో రాగ్ మయూర్ సన్నీ అనే క్యారెక్టర్లో కనిపించనున్నారు. ఏ విషయంలోనూ ఈజీగా నమ్మకం కుదరకపోవడం, ప్రతి విషయానికి ఓ కారణం వెతకడం, చిన్న విషయాన్ని కూడా పెద్దగా ఊహించుకోవడం అతడి క్యారెక్టర్‌లోని లక్షణాలుగా కనిపిస్తున్నాయి. ఈ ఓవర్‌థింకింగ్ వల్ల సన్నీ ఎదుర్కొనే పరిస్థితులే సినిమాలో కడుపుబ్బ నవ్వించబోతున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌లోనూ రాగ్ మయూర్ క్యారెక్టరైజేషన్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
Also Read
- Dulquer Salmaan: "టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా"
- Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
- Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
- Tollywood: చివరి నిమిషంలో బీజీఎంల మార్పు.. పెద్ద సినిమాల్లో కొత్త తలనొప్పులు!
సన్నీ ప్రశాంతత కోసం కాశ్మీర్‌కు వెళ్లినప్పుడు మెరిన్ ఫిలిప్ పోషించిన అమ్మాయి అతని జీవితంలోకి వస్తుంది. ఇద్దరి మధ్య ప్రేమ మొదలైన సమయంలో కథ ఊహించని మలుపు తిరుగుతుంది. ఓ పోలీస్ ఆఫీసర్ సన్నీని వెంటాడటం మొదలుపెట్టడంతో అసలు సమస్య ఏంటనే ప్రశ్న మొదలవుతుంది. సన్నీ నిజంగా ఏదైనా తప్పు చేశాడా? లేక అతడి అనుమానాలే అతన్ని ఈ పరిస్థితుల్లోకి నెట్టాయా? కాశ్మీర్లో జరిగిన అసలు కథ ఏంటి? అనే అంశాల చుట్టూ సినిమా సాగనున్నట్లు ట్రైలర్ సూచిస్తోంది. కామెడీతో పాటు క్రైమ్, సస్పెన్స్, డార్క్ కామెడీ టచ్ కూడా ఉండటంతో సాధారణ కామెడీ సినిమాలకు భిన్నంగా ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది.
ఇక ‘డీజే టిల్లు’ తర్వాత విమల్ కృష్ణ నుంచి వస్తున్న సినిమా కావడంతో ‘అనుమాన పక్షి’పై సహజంగానే అంచనాలు ఏర్పడ్డాయి. ‘డీజే టిల్లు’లో సిద్ధు జొన్నలగడ్డ క్యారెక్టరైజేషన్, డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇప్పుడు అదే తరహాలో మరో విభిన్నమైన క్యారెక్టర్‌ను రాగ్ మయూర్‌తో చేయించగా, ఈసారి కామెడీతో పాటు మిస్టరీ, క్రైమ్, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌ను కూడా కలిపినట్లు ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది.
‘సినిమా బండి’, ‘కీడా కోలా’ వంటి సినిమాలతో తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్న రాగ్ మయూర్ ఈ చిత్రంలో తొలిసారి సోలో హీరోగా కనిపిస్తున్నారు. సన్నీ పాత్రలో అతడి ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్, ఓవర్‌థింకింగ్ కామెడీ ట్రైలర్లో ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. మెరిన్ ఫిలిప్ కథానాయికగా నటించగా, అజయ్, రాశి, ప్రిన్స్ సెసిల్, అనన్య, చరిత్, బ్రహ్మాజీ, మస్త్ అలీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ‘అనుమాన పక్షి’ రిలీజ్ డేట్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సెప్టెంబర్ 18న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.
- Tags
- Anumana Pakshi
- cinema
తాజావార్తలు
-
Pulivendula Re-Polling: రీ-పోలింగ్‌పై గందరగోళం.. పులివెందులలో ఇంకా తెరుచుకోని పోలింగ్ కేంద్రం!
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!
-
Shreyas Iyer: మేము చెత్తగా ఆడాం, చాలా తప్పులు చేశాం.. న్యూజిలాండ్ ఓటమిపై శ్రేయస్ కీలక వ్యాఖ్యలు!
-
India Renewable Energy Summit 2026: ప్రధాని మోడీ చేతుల మీదుగా.. నేడు ఇండియా రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్ 2026 ప్రారంభం
-
Murusu Cyclone Alert: దూసుకొస్తున్న మురసు తుఫాన్.. నేడు అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు!
ట్రెండింగ్
-
IND vs NZ: వన్డే సిరీస్‌కు ముందు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్స్ సిరీస్ నుండి అవుట్.!
-
SOS బటన్, Family Assist ఫీచర్లtho ‘సీనియర్ సిటిజన్ల’ కోసం Nokia 2360 Flip ఫోన్ లాంచ్..!
-
Jio vs Airtel vs Vi: కేవలం వాయిస్ కాల్స్ కోసమే రీఛార్జ్.. ఏ కంపెనీ ప్లాన్ బెస్ట్.?
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు