Site icon NTV Telugu

Anukunnavanni Jaragavu Konni: ఇంట్రెస్టింగ్ గా ‘అనుకున్నవన్ని జరగవు కొన్ని’ పోస్టర్‌

Anukunnavanni Jaragavukonni

Anukunnavanni Jaragavukonni

Anukunnavanni JaragavuKonni First Look Teaser: శ్రీరామ్‌ నిమ్మల, కలపాల మౌనిక జంటగా ‘అనుకున్నవన్ని జరగవు కొన్ని’ అనే సినిమాలో నటించారు. శ్రీ భారత ఆర్ట్స్‌ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాకి జి.సందీప్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా పోస్టర్‌ను అల్లరి నరేష్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా నరేష్‌ మాట్లాడుతూ ‘అనుకున్నవన్ని జరగవు కొన్ని’ టైటిల్‌ లాంచ్ చేయడం ఆనందంగా ఉంది, పోస్టర్‌ ఆసక్తికరంగా ఉంది. దర్శకుడు నేను నటించిన ‘సిల్లీ ఫెలోస్‌’ చిత్రానికి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశాడు, ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కావడం ఆనందంగా ఉంది. ఈ సినిమా విజయవంతమై టీమ్‌ అందరికీ మంచి పేరు రావాలి, దర్శకుడిగా సందీప్‌ బిజీ కావాలి’’ అని అన్నారు.

Renu Desai: రేణు దేశాయ్ చెప్పినంత లేదే!

హీరో శ్రీరామ్‌ నిమ్మల మాట్లాడుతూ ”క్రైమ్‌ కామెడీ థ్రిల్లర్‌ ఇది, నరేష్‌ క్రైమ్‌, కామెడీ జానర్‌ చిత్రాలెన్నో చేశారు. ఈ టైటిల్‌ లాంచ్ చేయడానికి ఆయనే కరెక్ట్‌ అనిపించిందని అన్నారు. సినిమా అవుట్‌పుట్‌ బాగా వచ్చింది, నవంబర్‌ 3న సినిమాను విడుదల చేస్తున్నాం’’ అని తెలిపారు. దర్శకుడు సందీప్‌ మాట్లాడుతూ ”దర్శకుడిగా తొలి చిత్రమిది, క్రైమ్‌ కామెడీ నేపథ్యంలో తెరకెక్కించాం, ఆరిస్ట్‌లు అంతా అద్భుతంగా యాక్ట్‌ చేశారని అన్నారు. అందరికీ ఈ సినిమా నచ్చుతుంది, ముఖ్యంగా కామెడీని బాగా ఎంజాయ్‌ చేస్తారు. నవంబర్‌ 3న విడుదల కానున్న మా సినిమాను తప్పకుండా థియేటర్స్‌లో చూడండి అన్నారు. ఇక హీరోయిన్ మౌనిక సినిమాలో అవకాశం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ, సినిమా సక్సెస్‌ కావాలని ఆకాంక్షించారు.

Exit mobile version