Anudeep Wore Footwear at Asish Reddy Reception: జాతి రత్నాలు అనే సినిమా చేసి ఓవర్ నైట్ గుర్తింపు తెచ్చుకున్నాడు అనుదీప్. అప్పటివరకు అనుదీప్ అనే వ్యక్తి ఎవరో కూడా జనానికి తెలియదు కానీ ఎప్పుడైతే నవీన్ పోలిశెట్టి హీరోగా ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలలో జాతి రత్నాలు సినిమా చేశాడో అప్పటినుంచి అనుదీప్ బాగా ఫేమస్ అయిపోయాడు. వైజయంతి మూవీస్ బ్యానర్ కి అనుబంధంగా ఏర్పాటు అయిన స్వప్న సినిమాస్ నిర్మించిన ఈ జాతి రత్నాల సినిమా భారీ హిట్ కావడమే కాక అనేక లాభాలు కూడా తెచ్చిపెట్టింది. దానికి తోడు అనుదీప్ వ్యక్తిత్వం కూడా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు చర్చనీయాంశమవుతూ ఉంటుంది . ఎందుకంటే ఆయనని ఇంటర్వ్యూ చేసే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏ ప్రశ్న అడిగినా సరైన సమాధానం చెప్పకుండా దాటవేసే పద్ధతిలో సమాధానం చెబుతూ ఉంటాడు. అంతేకాదు ఏ ప్రశ్నకు ఆయన సరైన సమాధానం చెప్పడం లేదేమో అని అనుమానం కలిగించేలా ఆయన సమాధానాలు ఉంటాయి.
Nani Birthday ode: నాని పుట్టినరోజు… స్వయంగా కవిత రాసిన నిర్మాత
అయితే ఆయన కాలికి చెప్పులు లేకుండా జాతి రత్నాలు సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి కనిపిస్తూ ఉండేవాడు. ఎందుకు చెప్పులు వేసుకోవడం లేదు అని కొంతమంది ఇంటర్వ్యూస్ లో అడిగితే భూమికి మనకి కనెక్టివిటీ బాగా తగ్గిపోయింది. కాబట్టి వీలైనంతగా తాను చెప్పులు లేకుండానే నడుస్తానని చెప్పుకొచ్చాడు. అయితే అలాంటి అనుదీప్ ఆశ్చర్యకరంగా చెప్పులేసుకుని కనిపించాడు. అసలు విషయం ఏమిటంటే తాజాగా దిల్ రాజు సోదరుడు శిరీష్ కుమారుడు ఆశిష్ రెడ్డి రిసెప్షన్ హైదరాబాద్ ఎన్కన్వెన్షన్ లో జరిగింది ఈ కార్యక్రమానికి దిల్ రాజు స్వగ్రామం నుంచి అనేక మంది హాజరయ్యారు. తెలుగు సినీ పరిశ్రమలో నుంచి అగ్ర హీరోలు, దర్శక నిర్మాతలు కూడా హాజరయ్యారు ఈ వేడుకకు హాజరైన అనుదీప్ చెప్పులేసుకుని కెమెరాల కంట పడ్డాడు. ఆయన ఎందుకు చెప్పులేసుకొచ్చాడు అనే విషయం మీద పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.
