Site icon NTV Telugu

Anudeep K V: ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ థియేటర్లో పడేది ఎప్పుడంటే…

First Day First Show

First Day First Show

When will the First Day First Show hit the theatres?

ప్రతిష్టాత్మక పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అధినేత‌ ఏడిద నాగేశ్వర‌రావు మ‌నవ‌రాలు శ్రీ‌జ నిర్మాత‌గా శ్రీ‌జ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బేన‌ర్‌లో నిర్మిస్తున్న చిత్రం ‘ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో’. ఏడిద శ్రీరామ్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి మిత్రవింద మూవీస్ సంస్థ కో-ప్రొడ్యూసర్. ‘జాతి రత్నాలు’ ఫేమ్ అనుదీప్ కెవి కథ, చిత్రానువాదం, సంభాషణలు అందించిన ఈ సినిమాతో వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ దర్శకులుగా పరిచయం అవుతున్నారు. శ్రీకాంత్ రెడ్డి, సంచిత బాసు హీరోహీరోయిన్లుగా నటిస్తుండగా, తనికెళ్ల భరణి, ‘వెన్నెల’ కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, మహేష్ ఆచంట, ప్రభాస్ శ్రీను, గంగవ్వ, సివిఎల్ నరసింహారావు, వంశీధర్ గౌడ్, సాయి చరణ్ బొజ్జా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సరికొత్త కామెడీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రమోషన్స్ ను దర్శక నిర్మాతలు గత కొంతకాలంగా ఆసక్తికరంగా జనం ముందుకు తీసుకొస్తున్నారు. రాథన్ స్వరపరిచిన పాటల్లో రెండు ఇప్పటికే విడుదల అయ్యి చక్కని ఆదరణ పొందాయి. తాజాగా ఈ మూవీ విడుదల తేదీని సైతం మూవీ టీమ్ ప్రకటించింది. సెప్టెంబర్ 2వ తేదీ ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ ను విడుదల చేస్తున్నట్టు తెలిపింది.

ఇక అదే రోజున ఇప్పటికే మరో రెండు సినిమాలు సైతం విడుదల కానున్నాయి. అందులో ఒకటి వైష్ణవ్ తేజ్ ‘రంగరంగ వైభవం’ కాగా, మరొకటి ‘ఆకాశవీధుల్లో’ సినిమా… మరి విడుదల తేదీ దగ్గరయ్యే కొద్ది… మరింకెన్ని సినిమాలు ఆ తేదీన వస్తాయో చూడాలి. ఏదేమైనా… తొలి చిత్రంతోనే ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ తన చిత్రానికి మంచి హైప్ ను క్రియేట్ చేసిందనే చెప్పాలి.

 

Exit mobile version