యంగ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా, శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి పతాకాలపై ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్ గా రూపొందుతోంది ‘అనుభవించు రాజా’ చిత్రం. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కింగ్ నాగార్జున విడుదల చేశారు. ‘అనుభవించు రాజా’ టైటిల్ సౌండింగే చాలా డిఫరెంట్‌గా అనిపిస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో చాలా సంతోషంగా, లైఫ్ ను ఎంజాయ్ చేసే పాత్రను రాజ్ తరుణ్ పోషిస్తున్నట్టు అర్థమౌతోంది. అలాగే అతని లుక్, డ్రెస్సింగ్ చూస్తుంటే పందెం రాయుడిలాగా కనిపిస్తున్నాడు. చేతి వేళ్ళకు బంగారు ఉంగరాలు, మణికట్టుకు బ్రాస్‌లెట్ వేసుకుని ఉన్నాడు. కోడి పందాలు, జూదం ఆడే వ్యక్తిలా కనిపిస్తున్న రాజ్‌తరుణ్ తన కోడితో యమ సరదాగా ఫోజిచ్చాడు. ఓవర్ ఆల్ గా ఈ లుక్ చూస్తుంటే… ‘సోగ్గాడే చిన్న నాయనా’లోని బంగార్రాజు కొడుకును తెరపై చూడబోతున్నామా అన్నట్టుగా ఉంది.
గతంలో రాజ్ తరుణ్ తో ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ మూవీని తెరకెక్కించిన శ్రీను గవిరెడ్డి దీన్ని డైరెక్ట్ చేశాడు. కషీష్ ఖాన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న ఈ మూవీకి నిర్మాత సుప్రియ యార్లగడ్డ. విశేషం ఏమంటే.. కాషిష్ ఖాన్ మరో తెలుసు సినిమా ‘కిన్నెరసాని’లోనూ నాయికగా నటిస్తోంది. యూత్ ఫుల్ ఎంటర్ టైనింగ్ లవ్ స్టోరీ ‘అనుభవించు రాజా’కు గోపీసుందర్ సంగీతాన్ని, నగేశ్ బానెల్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా పూర్తి అప్ డేట్స్ కోసం కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.