Site icon NTV Telugu

“అనుభవించు రాజా” రిలీజ్ డేట్ ఫిక్స్

Anubhavinchu Raja Coming to theatres On this Nov 26th

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రాజ్ తరుణ్ నెక్స్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ “అనుభవించు రాజా”. ఈ చిత్రంలో రాజ్ తరుణ్ జూదగాడిగా, బాధ్యత తెలియని యువకుడిగా, కేవలం లైఫ్ ను ఎంజాయ్ చేయడానికే పుట్టినట్టుగా కనిపించే పాత్రను పోషిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా టీజర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. టైటిల్ సాంగ్ కూడా అందరినీ ఆకట్టుకుంది. తాజాగా సినిమా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్.

Read Also : “అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే” ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో

“అనుభవించు రాజా” నవంబర్ 26న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా విడుదల సమయంలో 2 నుండి 3 వారాల వరకు పెద్ద పోటీ ఉండకపోవచ్చు. కాబట్టి సినిమా విడుదలకు ఇది సరైన సమయం అని భావించినట్టున్నారు మేకర్స్. నిర్మాతలు విడుదల తేదీని ఖరారు చేసేయడంతో చిత్రబృందం “అనుభవించు రాజా” ప్రమోషన్లలో దూకుడు పెంచనుంది. “అనుభవించు రాజా” చిత్రానికి శ్రీను గవిరెడ్డి దర్శకత్వం వహించగా, సుప్రియ యార్లగడ్డ అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌లపై నిర్మించారు. గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చనున్నారు.

Exit mobile version