Site icon NTV Telugu

Ante Sundaraniki Teaser : ట్విస్ట్ తో డౌట్ పెంచేసిన సుందరం

Ante Sundaraniki

Ante Sundaraniki

నేచురల్ స్టార్ నాని నెక్స్ట్ మూవీ “అంటే సుందరానికి”. యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో మలయాళ నటి నజ్రియా ఫహద్ కథానాయికగా నటించింది. నేడు హైదరాబాద్‌లో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. సాంప్రదాయ ఆచారాల కారణంగా కుటుంబం నుండి అనేక అభ్యంతరాలు, జీవితంలో అడ్డంకులు ఉన్న సాధారణ బ్రాహ్మణుడిగా నాని టీజర్లో అదరగొట్టేశాడు. మరోవైపు నజ్రియా క్రిస్టియన్ అమ్మాయి, ఫోటోగ్రఫీని ఇష్టపడుతుంది. హిందువు అయిన నాని, క్రిస్టియన్ అమ్మాయి ఇద్దరూ ప్రేమలో పడడం ఆసక్తికి రేకెత్తించింది. అయితే అసలు విషయం చెప్పలేదు అంటూ విషయం చెప్పకుండా సుందరం సినిమాపై ప్రేక్షకులకు ఆసక్తిని పెంచేశాడు. సింపుల్ ట్విస్ట్ తో అసలు విషయం ఏమై ఉంటుందా ? అనే డౌట్ పెంచేశాడు సుందరం. మరి ట్రైలర్ లోనైనా ఈ విషయాన్ని రివీల్ చేస్తారా ? లేదా ? అనేది చూడాలి.

Read Also : Chiranjeevi : చంద్రబాబుకు స్పెషల్ బర్త్ డే విషెస్

ఇక సరదాగా సాగే ఈ టీజర్ చాలా ప్రామిసింగ్ గా ఉంది. నాని తన అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో అందరినీ కడుపుబ్బా నవ్వించబోతున్నాడని అర్థమవుతోంది. వివేక్ సాగర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నరేష్, రోహిణి, నదియా, హర్ష తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘అంటే సుందరానికి’ మూవీ జూన్ 10న తెలుగు, తమిళం, మలయాళంలో థియేటర్లలో విడుదల కానుంది. టీజర్ ను కూడా ఈ మూడు భాషల్లో రిలీజ్ చేశారు.

Exit mobile version