NTV Telugu Site icon

Ante Sundaraniki : టీజర్ కు టైమ్ ఫిక్స్… మీట్ నాటి సుందర్, మైటీ లీలా

Ante Sundaraniki

Ante Sundaraniki

నేచురల్ స్టార్ నాని చేస్తున్న తాజా కామెడీ ఎంటర్టైనర్ “అంటే సుందరానికి”. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ లో నాని సరసన మలయాళ భామ నజ్రియా నజీమ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ మూవీ జూన్ 10న థియేటర్లలోకి రానుంది. తెలుగులోనే కాకుండా ఈ చిత్రాన్ని మరో రెండు భాషల్లో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా టీజర్ రిలీజ్ కు రంగం సిద్ధమైంది. ఈ మేరకు మేకర్స్ కొద్దిసేపటి క్రితం అధికారిక ప్రకటన విడుదల చేశారు.

Read Also : Sarkaru Vaari Paata : క్రేజీ అప్డేట్… ఏం జరుగుతోందంటే?

“అంటే సుందరానికి” టీజర్‌ను ఈ నెల 20న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నామని తెలుపుతూ విడుదల చేసిన హీరోహీరోయిన్ల పోస్టర్లు ఆకట్టుకుంటున్నాయి. ఇందులో ఒక పోస్టర్లో సుందర్, లీలా హిందూ సంప్రదాయ పద్ధతిలో, మరో పోస్టర్లో వెస్ట్రన్ పెళ్లి దుస్తుల్లో కన్పిస్తున్నారు. టీజర్ విడుదలయ్యేదాకా మీట్ నాటి సుందర్, మైటీ లీలా అంటూ నాని, నజ్రియాను పరిచయం చేశారు. ప్రస్తుతం మూవీ పిక్స్ వైరల్ అవుతున్నాయి. రెండు పోస్టర్లలో వీరి కెమిస్ట్రీ అదిరిపోయింది.