Site icon NTV Telugu

Ante Sundaraniki: అమెరికాలో సుందర్ మాస్టరూ.. పంచెకట్టుతో దిగేశారు..

Ante Sundaraniki

Ante Sundaraniki

న్యాచురల్ స్టార్ నాని శ్యామ్ సింగ్ రాయ్ హిట్ తరువాత మంచి జోరు పెంచేశాడు. వరుస సినిమాలను లైన్లో  పెట్టడమే కాకుండా రిలీజ్ కి కూడా సిద్ధం చేస్తున్నాడు. ఇక ఇప్పటికే దసరా శరవేగంగా షూటింగ్ ని పూర్తిచేస్తుండగా.. అంటే సుందరానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని సరసన మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా నజీమ్ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్,  వీడియోస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మొదటి పాట విధులకు మేకర్స్ ముహూర్తం పెట్టారు.

పంచెకట్టు అంటూ సాగే ఈ సాంగ్ ప్రోమోను తాజాగా  మేకర్స్ రిలీజ్ చేశారు. రంగంలోకి దూకారు.. సుందర్ మాస్టారూ అంటూ సాగె ఈ సాంగ్ ఆసక్తికరంగా ఉంది. ఈ సాంగ్ ని మొట్టమొదటిసారి కర్నాటిక్  సింగర్ అరుణ సాయి రామ్ ఆలపించారు. అమెరికాలో పంచెకట్టుతో బిల్డప్ గా కనిపించి నాని ఇంకా ఆసక్తిని పెంచేశాడు. వివేక్ సాగర్ సంగీతం ఎంతో ఫ్రెష్ గా ఉంది. ఇక ఫుల్ సాంగ్ ని ఏప్రిల్ 6 న రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 10 న రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో నాని మరో హిట్ ని తన ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి.

https://www.youtube.com/watch?v=xnpu_U6CtAk

Exit mobile version