17న జనం ముందుకు ‘యాంట్ – మేన్ అండ్ ద వాస్ప్ : ద క్వాంటమేనియా’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘Ant-Man and the Wasp: Quantumania’: ప్రపంచ వ్యాప్తంగా ఆబాలగోపాలాన్నీ అలరిస్తోన్న మార్వెల్ కామిక్స్ ఈ సారి ‘యాంట్ -మేన్ అండ్ ద వాస్ప్: ద క్వాంటమేనియా’తో ఫిబ్రవరి 17న జనం ముందుకు వస్తోంది. సైంటిఫిక్ ఫిక్షన్ గా రూపొందిన ఈ చిత్రం కథ, కథనం అందరినీ అలరించే రీతిలో ఉందని ప్రీమియర్ చూసిన వారు ప్రశంసిస్తున్నారు. సూపర్ హీరోస్ స్కాట్ లాంట్, హోప్ వాన్ డైన్ మరోసారి యాంట్ మేన్, ద వాస్ప్ గా అలరించడానికి సిద్ధమయ్యారు. పేటన్ రీడ్ దర్శకత్వంలో ఇంతకు ముందు తెరకెక్కిన ‘యాంట్ మేన్’ సీరీస్ ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఇప్పుడు మరోమారు పేటన్ రీడ్ తనదైన పంథాలో ఈ ‘యాంట్-మేన్ అండ్ ద వాస్ప్: ద క్వాంటమేనియా’ను తెరకెక్కించారు. ఈ సారి కథ విషయానికి వస్తే యాంట్ -మేన్ స్కాట్ లాంగ్, ద వాస్ప్ హోప్ వాన్ డైన్ ఓ విచిత్ర ప్రపంచంలోకి అడుగు పెడతారు. వారితో పాటు హాంక్ తల్లిదండ్రులు జానెట్ వాన్ డైన్, హాంక్ ఫైమ్, స్కాట్ కుమార్తె కాసీ లాంగ్ కలసి మొత్తం కుటుంబం క్వాంటమ్ సామ్రాజ్యాన్ని వెదుకుతూ పోతుంది. వారికి వింత వింత జీవులు తారసపడతాయి. వాటితో సంభాషిస్తూ క్వాంటమ్ సామ్రాజ్యంలో సాహసాలకు తెరతీస్తారు. ఆ తరువాత ఏమయింది అన్నదే ఆసక్తికరమైన అంశం.
ఈ చిత్రంలో స్కాట్ లాంగ్ గా పాల్ రూడ్, హోప్ వాన్ డైన్ గా ఎవాంజలిన్ లిల్లీ, జానెల్ వాన్ డైన్ గా మిచెల్ పిఫర్, హాంక్ పైమ్ గా మైఖేల్ డగ్లాస్ (‘బేసిక్ ఇన్ స్టింక్ట్’ ఫేమ్), కాసీ లాంగ్ గా క్యాథరిన్ న్యూటన్ నటించారు. జోనాథన్ మేజర్స్ ఇందులో కాంగ్ పాత్రలో అలరించనున్నారు. ఈ సినిమాకు కెవిన్ ఫీగె, స్టీఫెన్ బ్రౌసార్డ్ నిర్మాతలు. లాస్ ఏంజెలిస్ లో ఈ మూవీ ప్రీమియర్ చూసిన వారందరూ మళ్లీ మళ్ళీ చూడాలని తపిస్తున్నారు. ఫిబ్రవరి 17 ఈ సినిమా ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతోంది.
Also Read
తాజావార్తలు
-
RCB Champion: ఐపీఎల్ ఫైనల్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం.. రెండో సారి కప్ అందుకున్న RCB..
-
Vaibhav Sooryavanshi: కోహ్లీ, గిల్, యశస్వి జైస్వాల్‌ను వెనక్కి నెట్టిన వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల వయస్సులోనే అరుదైన రికార్డు..
-
Virat Kohli: ఆకాశమే హద్దుగా చెలరేగిన విరాట్ కోహ్లీ.. 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో అరుదైన రికార్డు సాధించిన కింగ్..
-
GT Vs RCB: వార్ వన్ సైడ్ అయిపోయింది.. ఫైనల్ మజా రావడం లేదు.. నిరాశలో అభిమానులు..
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
ట్రెండింగ్
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!