NTV Telugu Site icon

Anshu: మన్మథుడు బ్యూటీ రీ ఎంట్రీ ఫిక్స్.. భలే సినిమా పట్టేసిందే?

Anshu

Anshu

Anshu Ambani to do a Crucial Role in Sandeep kishan movie: అన్షు అంబానీ..ఈ భామ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. నాగార్జున నటించిన మన్మధుడు సినిమాతో ఈ భామ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత ప్రభాస్‌ తో రాఘవేంద్ర మూవీలో కూడా నటించింది. అప్పట్లో ఈ బ్యూటీ అందానికి యూత్‌ పిచ్చెక్కిపోయారు. ఆ తరువాత మిస్సమ్మలో గెస్ట్ రోల్ తో పాటు ఒక తమిళ సినిమా చేసింది. ఈ భామ చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. కానీ ఆ సినిమాలతోనే ఆమె సినీ ఇండస్ట్రీకి గుడ్‌ బై చెప్పేసింది. మళ్లీ ఎక్కడా కనిపించకుండా వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్లీ ఇరవై ఏళ్ల తర్వాత ఆమె మీడియా ముందుకొచ్చింది. అప్పుడు అంత సడెన్‌గా ఎందుకు సినిమాలను వదిలేయాల్సి వచ్చిందో కారణాలను కూడా వివరించింది.

Samantha: బాత్ టబ్ ఫొటోలు వైరల్.. సమంత కీలక వ్యాఖ్యలు?

తాను ఇంగ్లండ్‌లో పుట్టి పెరిగినప్పటికీ.. తన పూర్వీకులు భారతీయులేనని తనకు 16 ఏళ్లు ఉన్న సమయంలో ఇండియాకు వచ్చానని.. అప్పుడే మన్మథుడు సినిమాలో ఆఫర్‌ వచ్చిందని చేసి మళ్ళీ అక్కడికి వెళ్లిపోయానని చెప్పుకొచ్చింది. ఇక ఇప్పుడు ఆమె రీఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి సందీప్ కిషన్ త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. హాస్య మూవీస్ బ్యానర్ మీద రాజేష్ దండ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం అన్షుకి దర్శకుడు కథ చెప్పినట్లుగా తెలుస్తోంది. కథ , తన పాత్ర నచ్చడంతో ఆమె సినిమాకి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఆమెకు తెలుగులో రీఎంట్రీ సినిమాగా నిలవబోతున్నట్లు చెబుతున్నారు. అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా అగ్రిమెంట్లు అయ్యాకే ఆమె ఫైనల్ చేసినట్టు. చూడాలి మరి ఏమవుతుంది? అనేది.

Show comments