Anshu Ambani met Nagarjuna: ఆమె కెరీర్ లో చేసింది మూడు తెలుగు సినిమాలు. అందులో రెండు హీరోయిన్గా నటిస్తే ఒకదానిలో మాత్రం అతిథి పాత్రలో నటించింది. ఆ తర్వాత జై అనే తమిళ సినిమాలో నటించి ఒక్కసారిగా సినీ వినీలాకాశం నుంచి మిస్ అయిపోయింది. సుమారు 20 ఏళ్ల తర్వాత ఆమె మళ్ళీ కెమెరా ముందుకొచ్చింది. ఇంతకీ ఆమె ఎవరు అని ఆలోచిస్తున్నారు కదా? ఇంకెవరో కాదు మన్మధుడు సినిమాలో మహేశ్వరి అలియాస్ మహి అనే పాత్రతో అప్పటి కుర్ర కారు అందరిని ఆకట్టుకుని వారి గుండెలను మెలిపెట్టిన అన్షు అంబానీ. నిజానికి లండన్ లోనే పుట్టి పెరిగిన అన్షు ఒక కెమెరామెన్ కంటపడి అనూహ్యంగా మన్మధుడు ఒక పాత్ర చేసింది.
Bollywood to South: 2024లో సౌత్ మీద కన్నేసిన 8 మంది బాలీవుడ్ స్టార్స్ వీరే!
ఆ తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన రాఘవేంద్ర అనే సినిమాలో కూడా ఆమె హీరోయిన్గా నటించింది. మన్మధుడు సూపర్ హిట్ అయినా సరే ఆమెకు అంతగా పేరు రాలేదు. రాఘవేంద్ర అంతగా ఆడకపోవడంతో ఆమెకు అవకాశాలు తగ్గాయి. మిస్సమ్మ అనే సినిమాలో చిన్న అతిథి పాత్ర చేసి తమిళ్ షిఫ్ట్ అయింది. తర్వాత ఏమనుకున్నావ్ ఏమో సైలెంట్ గా లండన్ కు చెందిన ఒక వ్యక్తిని వివాహం చేసుకొని పూర్తిగా సినిమాకు దూరం అయిపోయింది. ఇప్పుడు హైదరాబాద్ లో ప్రత్యక్షమైన ఆమె పలు యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇస్తూ మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చే ప్రయత్నం చేస్తోంది. అయితే తాజాగా ఆమె మన్మధుడు నాగార్జునను కలిసి అప్పటి విషయాలను గుర్తు తెచ్చుకుని ఎమోషనల్ అయ్యారు. వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలలో ఆమె నాగార్జునను చూసి మైమరిచి పోతున్నట్లుగా కనిపిస్తూ ఉండడంతో మన్మధుడిని చూసి ఆమె మైమరచిపోతుంది అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
