NTV Telugu Site icon

Chiranjeevi: ఎన్టీఆర్ ను చూస్తే ఏఎన్నార్ కి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్.. అప్పటి రహస్యాలు బయటపెట్టిన చిరంజీవి

Chiranjeevi

Chiranjeevi

ANR Felt inferiority complex when compared with NTR Says Chiranjeevi: ఈరోజు విశాఖపట్నంలో లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 28వ వర్ధంతి, ఏఎన్ఆర్ శత జయంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ను చూస్తే ఏఎన్ఆర్ కి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉందనే విషయం తనకు చెప్పినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ అక్కినేని నాగేశ్వరరావు తనకు చెప్పిన మాటలను మరోసారి జ్ఞాపకం చేసుకున్నారు. ఆయన మాట్లాడుతూ అక్కినేని నాగేశ్వరరావు రామారావు గురించి చెబుతూ ఆయన నేను ఒకేసారి వచ్చాం రామారావు మంచి అందగాడు, అంతేకాక మంచి ముఖ వర్చస్సు ఉన్నవాడు, అలాంటి స్ఫురద్రూపి ముందు నన్ను నేను చూసుకుంటే ఒకోసారి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చేది.

Ayodhya Ram Mandir : అయోధ్య రాముడికి విరాళమిచ్చిన సినీ ప్రముఖులు ఎవరంటే?

ఆయనతో కలిసి 14 సినిమాల వరకు చేశాను చిన్నవో పెద్దవో. ఆయనని పక్కనే చూసుకున్నప్పుడు నన్ను నేను ఆయన పక్కన చూసి నన్ను నేను బూస్టప్ చేసుకోవడానికి సమాయత్తం చేసుకోవడానికి నేను ఏమీ తక్కువ కాదు అని అనిపించుకోవడానికి అద్దం ముందు నిలబడి నేను నాకు నేనే సర్ది చెప్పుకునేవాడిని. ఆయన ఆజానుబాహుడే అయ్యుండొచ్చు కానీ మానసికంగా నేను అంతకన్నా ఎక్కువే అని అనుకునేవాడిని. అది ఒక స్టైల్ గా మారిపోయింది. నాకు ఒక కన్ను ఎగరేసే అలవాటు ఉంది, అది రాను రాను అక్కినేని నాగేశ్వరరావు స్టైల్ గా మారిపోయింది అని అన్నారు. అంటే అక్కినేని నాగేశ్వరరావు తన బలహీనతలను బలాలుగా మార్చుకొని అందరి చేత అవన్నీ ఏఎన్ఆర్ స్టైల్ రా అనిపించుకునేలా చేశారు. అందుకే మన బలం కన్నా బలహీనతలు గుర్తించడం చాలా ఆవశ్యకమైన విషయం అని మెగాస్టార్ చిరంజీవి ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

Show comments