Site icon NTV Telugu

Tollywood : మరో స్టార్ ఫ్యామిలీ వారసుడి టాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్

Gattamaneni

Gattamaneni

టాలీవుడ్ లో స్టార్ హీరోల వారసుల ఎంట్రీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ లిస్ట్ లో బలయ్య కుమారుడు మోక్షజ్ఞ, పవర్ స్టార్ తనయుడు అకిరా నందన్ లు వెండితెరకు ఎప్పుడు పరిచయమవుతారోనని ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. మహేశ్ కొడుకు అమెరికాలో చదువుకుంటు నటనలో శిక్షణ తీసుకుంటున్నాడు. కాగా ఇప్పుడు మరో స్టార్ ఫ్యామిలీ వారసుడి ఎంట్రీకి రంగం సిద్ధం అవుతోంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు అన్న ఘట్టమనేని రమేష్ కొన్నాళ్ల పాటు హీరోగా పలు సినిమాలలో నటించారు.

Also Read : Ramya Pasupuleti : వేడి వేడి అందాలతో వేసవిలో చలిపుట్టిస్తున్న భామ

ఇప్పుడు ఆయన వారసుడు ఘట్టమనేని జయకృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా అడుగుపెట్టనున్నాడు. జయకృష్ణ ఎంట్రీ భాద్యతలను అజయ్ భూపతికి అందజేశారు. ఆర్ ఎక్స్ 100ఎం మహా సముద్రం, మంగళవారం సినిమాలతో మెప్పించిన దర్శకుడు  అజయ్ భూపతి డైరెక్షన్ లో జయకృష్ణ ఓ సినిమా చేయబోతున్నాడు. తోలి సినిమాగా యాక్షన్ లవ్ స్టోరీ కథ నేపధ్యంలో రానున్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్ భారీ చిత్రాలు నిర్మించే వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వినీదత్ నిర్మాణంలో ఈ సినిమా ఉండబోతున్నట్టు టాక్. మహేశ్ బావ సుధీర్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇంకా స్ట్రగుల్ అవుతూనే ఉన్నాడు. మహేశ్ మేనల్లుడు అశోక్ గల్లా కూడా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. ఇప్పుడు మహేశ్ అన్న కొడుకు ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే జయకృష్ణ విషయంలో అన్ని తానై వ్యవహరిస్తున్నాడట మహేశ్ బాబు. ఎట్టి పరిస్థితుల్లో జయకృష్ణ కు గ్రాండ్ లాంచింగ్ ఉండేలా చూస్తున్నాడట. బాబాయ్ మహేశ్ కనుసన్నల్లో తొలి అడుగులు వేయబోతున్న జయకృష్ణ కు టాలీవుడ్ లో జయం కలగాలని ఆశిద్దాం.

Exit mobile version