NTV Telugu Site icon

SSMB29 : మళ్లీ ఫొటో లీక్.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా..!

Ssmb 29

Ssmb 29

SSMB29 : రాజమౌళికి కొత్త తలనొప్పులు వస్తున్నాయి. ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నా సరే ఎస్ ఎస్ ఎంబీ-29 నుంచి లీకులు ఆగట్లేదు. మొన్న ఒడిశాలో సెట్స్ నుంచి ఏకంగా వీడియోనే లీక్ అయి సోషల్ మీడియాను ఊపేసింది. దీంతో మహేశ్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. రిలీజ్ కు ముందే కథ లీక్ అయిపోతుందని ప్రచారం జరిగింది. అప్పటి నుంచి సెట్స్ వద్ద రాజమౌళి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని మూవీ టీమ్ చెబుతోంది. సెక్యూరిటీ టైట్ చేశాడని.. చిన్న లీక్ కూడా ఉండదనే వార్తలు వినిపించాయి. కానీ తాజాగా అదే ఒడిశా సెట్స్ నుంచి మరో ఫొటో లీక్ అయిపోయింది.

read also : Priyanka Chopra : ఆమె నా మనసు గెలిచింది.. ప్రియాంక చొప్రా పోస్టు వైరల్

ఇందులో మహేవ్ బాబు నడుచుకుంటూ వెళ్తున్నాడు. బ్యాక్ నుంచి తీసిన ఈ ఫొటోలో మహేశ్ బాబు చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. నేటితో ఒడిశా షెడ్యూల్ పూర్తి అయింది. చివరి రోజు ఇలా లీక్ కావడంతో.. ఇది చూసిన వారంతా అసలు ఎందుకు లీక్ చేస్తున్నారనే ప్రశ్నలు వేస్తున్నారు. కావాలని చేస్తున్నారా.. లేదంటే అనుకోకుండా జరుగుతోందా అని ఆరా తీస్తున్నారు. ఎలా జరిగినా మూవీకి కావాల్సినంత బజ్ ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోతోందని అంటున్నారు ఫ్యాన్స్. కానీ రాజమౌళి సినిమా అంటే లీకులు అనే విషయమే ఉండదు. ఎందుకంటే లీకులు ఇస్తే సినిమాపై హైప్ తగ్గిపోతుందనే విషయం ఆయనకు తెలుసు.

అందుకే తన సినిమా నుంచి ఒక్క చిన్న ఫొటో కూడా లీక్ కాకుండా చూసుకుంటారు. గత సినిమాలను చూస్తేనే ఈ విషయం అర్థం అవుతుంది. బాహుబలి లాంటి సిరీస్ తీసినప్పుడు కూడా ఒక్క లీక్ లేదు. మహేశ్ సినిమా విషయంలో కూడా జక్కన్న మొదటి నుంచి సీక్రెట్ మెయింటేన్ చేస్తున్నాడు. కనీసం పూజా కార్యక్రమాన్ని కూడా బయటకు చూపించలేదు. ఒక్క పాత్ర గురించి కూడా ప్రకటించట్లేదు. అసలు ఎవరెవరు నటిస్తున్నారనేది కూడా బటయకు రానివ్వట్లేదు. కానీ ఇంకో పక్క లీకులు మాత్రం ఆగట్లేదు. దీంతో రాజమౌళికి ఏమైంది.. ఆయన సెక్యూరిటీ ఏమైంది అంటూ ఫ్యాన్స్ అడుగుతున్నారు. ఈ లీకులపై మూవీ టీమ్ ఏమైనా స్పందిస్తుందా లేదా అనేది చూడాలి.