కొంతమంది తారలకు ఆరంభంలో చాలా తక్కువ మంది ఫాలోవర్లు ఉంటారు. అయితే వారు నటించిన ఏదైనా ఒక సినిమా హిట్ అయితే వారి ఫాలోయింగ్ అమాంతం పెరగిపోతుంది. ప్రస్తుతం ‘సీతారామం’ బ్యూటీ విషయంలో అదే జరిగింది. గత 10 ఏళ్ళుగా ఈ బ్యూటీ సినిమాలతో పాటు టీవీ సీరియల్స్ చేస్తూ వస్తోంది. 4.5 మిలియన్ల ఫాలోవర్లతో ఉన్న ఈ ముద్దుగుమ్మకు ఒకే ఒక నెలలో మరో మిలియన్ పాలోవర్స్ వచ్చి చేశారు.
నిజానికి నెట్‌ఫ్లిక్స్ సంస్థ ‘బాహుబలి: బిఫోర్ ది బిగినింగ్’ వెబ్ సిరీస్ ప్రకటించి శివగామి పాత్రను మృణాల్ పోషిస్తుందనగానే ఒక్కసారిగా అందరి దృష్టి ఈ బ్యూటీపై పడింది. అయితే చివరకు ఆ సీరీస్ అటకెక్కడం ఆ తర్వాత ‘సీతారామం’లో సీత పాత్రను దక్కించుకోవడం జరిగిపోయాయి.
‘సీతారామం’ లో సీత అలియాస్ ప్రిన్సెస్ నూర్జహాన్‌గా సూపర్ ఫేమ్ తెచ్చుకోవడంతో మూడువారాల్లోనే అమ్మడి ఖాతాలో దాదాపు మరో మిలియన్ పాలోవర్స్ యాడ్ అయ్యారు. సినిమా విడుదలైన 20 రోజుల్లో మృణాల్ ఠాగూర్ ఫాలోవర్ల సంఖ్య 5.4 మిలియన్లకు చేరింది. మరి మునుముందు ఈ ఫాలోవర్స్ ఇంకెంతగా పెరుగుతారో చూడాలి.
