Site icon NTV Telugu

Harsha Sai: యూట్యూబర్ హర్ష సాయిపై మరో ఫిర్యాదు

Harsha Sai

Harsha Sai

Harsha Sai Case Update : యూట్యూబర్ హర్ష సాయి పై మరో ఫిర్యాదు నమోదు అయింది. తనపై ట్రోలింగ్ చేయిస్తున్నాడని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు హర్ష సాయి బాధితురాలు ఫిర్యాదు చేసింది. ట్రోలింగ్‌ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని, ట్రోలింగ్‌ స్క్రీన్‌ షాట్లను పోలీసులకు ఇచ్చింది బాధితురాలు. అత్యాచార బాధితురాలైన తనపై హర్షసాయి ఉద్దేశపూర్వకంగా ట్రోలింగ్​ చేయిస్తున్నాడని బాధితురాలు పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Devara: వారం రోజులు.. 410 కోట్లు.. నోళ్లు మూయించారు!

తనపై ఈ విధంగా సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్​ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆమె కోరారు. తనపై జరుగుతున్న ట్రోలింగ్​పై పలు స్క్రీన్​ షాట్లు సైతం ఆమె పోలీసులకు సమర్పించారు. బాధితురాలి ఫిర్యాదుతో మరో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల అదే బాధితురాలు హర్షసాయి తనపై లైంగిక దాడికి పాల్పడి, బెదిరింపులకు దిగుతున్నాడని నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారనే సంగతి తెలిసిందే. దీనిపై దర్యాప్తు కొనసాగుతుండగా, ట్రోలింగ్​ వ్యవహారంపై మరో ఫిర్యాదు రావడం గమనార్హం.

Exit mobile version