Site icon NTV Telugu

కమల్ హాసన్ ఆరోగ్యంపై తాజా హెల్త్ బులిటెన్

Kamal-Haasan

Kamal-Haasan

కోలీవుడ్ స్టార్ కమల్ హాసన్ యుఎస్ నుండి తిరిగి వచ్చిన వెంటనే కోవిడ్ -19 కు పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కమల్ చికాగోలో తన దుస్తుల లైన్ ‘హౌస్ ఆఫ్ ఖద్దర్’ని ప్రారంభించాడు. అక్కడ ఆయన వైరస్ బారిన పడ్డాడని అంటున్నారు. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చాకే ఆయన అనారోగ్యానికి గురయ్యారు. ఈ వారం ప్రారంభంలో చెన్నైకి తిరిగి వచ్చిన తర్వాత కమల్‌కు దగ్గు రావడం ప్రారంభమైంది. దీంతో వైద్యుల సలహా మేరకు కోవిడ్ టెస్ట్ చేయించుకోగా RT-PCR ఫలితం సానుకూలంగా వచ్చింది.

Read Also : టాలీవుడ్ లో విషాదం… ప్రముఖ దర్శకుడు కన్నుమూత

వెంటనే కమల్‌ను చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్‌ సెంటర్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. గత రాత్రి కమల్ ఆరోగ్యంపై అప్‌డేట్ ఇవ్వడానికి ఆసుపత్రి అధికారులు కొత్త బులెటిన్‌ను విడుదల చేశారు. “శ్రీ కమల్ హాసన్ శ్రీరామచంద్ర మెడికల్ సెంటర్‌లో చేరారు. ఆయన బాగా కోలుకుంటున్నాడు. ప్రస్తుతం పరిస్థితి నిలకడగా కొనసాగుతోంది” అని బులెటిన్‌లో పేర్కొన్నారు. దీంతో ఆయన ఆరోగ్యంగా ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటున్న అభిమానులకు కాస్త ఊరట కలిగింది. మరోవైపు ఆయనను దగ్గరుండి చూసుకోవడానికి కమల్ తనయ శృతి హాసన్ షూటింగ్ పనులు ముగించుకుని చెన్నైకి చేరుకున్నట్టు తెలుస్తోంది.

Exit mobile version