Site icon NTV Telugu

Saraswati Das: ఆగని నటీమణుల ఆత్మహత్యల పర్వం.. మరో మోడల్ బలి

Sarswati

Sarswati

చిత్రపరిశ్రమలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియడం లేదు.. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు మోడల్స్ ఒక్క నెలల్లో మృత్యువాత పడ్డారు.. ఇంకా వాటి నుంచే తేరుకోలేకుండా ఉన్న సినీ అభిమానులకు మరో చేదువార్త.. మరో మోడల్ ఆత్మహత్య చేసుకొని తనువూ చాలించింది. నిండా 18 ఏళ్లు కూడా లేని బెంగాలీ మోడల్‌, మేకప్‌ ఆర్టిస్ట్‌ సరస్వతి దాస్‌(18).. తన నివాసంలో ఈరోజు ఉదయం శవమై కనిపించింది. ప్రస్తుతం మోడళ్ల ఆత్మహత్యలు సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి. బెంగాల్ కు చెందిన నలుగురు మోడల్స్.. పల్లవి డే, సంగీత,.. ఇక మొన్నటికి మొన్న బిదిషా డి మజుందార్‌, ఆట షో విన్నర్ టీనా ఇలా వరుసగా మోడల్స్ ఆత్మహత్యలకు పాల్పడడం యాదృచ్ఛికమా..? లేక మరేదైనా కారణం ఉందా అనేది అందరిని కలవరపరుస్తుంది. ఇక సరస్వతి విషయానికొస్తే.. 18 ఏళ్ల సరస్వతి మోడల్ గా, మేకప్ ఆర్టిస్ట్ గా బెంగాల్ లో మంచి పేరు తెచ్చుకుంది.

కొంతకాలంగా తన తండ్రికి దూరంగా తల్లితో కలిసి వాళ్ల మేనమామ ఇంట్లో ఉంటున్న సరస్వతీ దాస్‌. మాధ్యామిక పరీక్షలో పాసయిన ఆమె చదువు విడిచిపెట్టి ట్యూషన్స్‌ చెబుతూ మోడల్‌గా రాణిస్తోంది. అయితే సరస్వతీ దాస్‌ కొంతకాలంగా తీవ్ర మానసిక ఒత్తిడితో బాధపడుతోందని కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు.. ఈ నేపథ్యంలోనే గత రాత్రి అమ్మమ్మతో కలిసి పడుకున్న ఆమె.. అర్ధరాత్రి ఒంటి గంట వరకు ఫోన్ మాట్లాడి.. అనంతరం రూమ్ లోకి వెళ్లి ఫ్యాన్ కు ఉరి వేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ సమయం వరకు ఎవరితో ఫోన్ మాట్లాడింది అనేది తెలియాల్సి ఉంది. అయితే ఆత్మహత్య చేసుకున్న చోట ఎలాంటి సూసైడ్‌ నోట్‌ లభించలేదని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఏదిఏమైనా బెంగాలీ మోడల్స్ ఇలా ఒకే విధంగా ఆత్మహత్యలకు పాల్పడడం వెనుక ఉన్న రహస్యం ఏంటి అనేది అంతుచిక్కని రహస్యంగా మారిపోయింది.

Exit mobile version