Anni Manchi Sakunamule Trailer: సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అన్ని మంచి శకునములే. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై స్వప్న దత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేసి చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపాడు. ఇక ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. మంచి కుటుంబ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలా కనిపిస్తుంది. రెండు కుటుంబాలు.. వారి మధ్య దూరం.. ఆ దూరాన్ని దగ్గరచేసే ఒక పెళ్లి.. ఆ పెళ్ళిలో వచ్చే గొడవలు.. ఇలా ట్రైలర్ సాగిపోతూ కనిపిస్తుంది.
Pavala Shyamala: బండ్ల గణేష్ తోసేస్తే.. పవన్ పరిగెత్తుకుంటూ వచ్చి.. దండం పెట్టి
ట్రైలర్ ను బట్టి.. హీరో హీరోయిన్లు బావమరదళ్ళుగా కనిపిస్తున్నారు. రెండు కుటుంబాల మధ్య గొడవలు.. కోర్టుకు వెళ్లడంతో ఎవరికి వారు విడిపోతారు. అయితే బావమరదళ్ళ మధ్య ఆ ప్రేమ చిన్నప్పటి నుంచి పెరుగుతూ వస్తుంది. కానీ, ఇంట్లో పెద్దవాళ్ళ గొడవల వలన వారు చెప్పుకోరు అన్నట్లు కనిపిస్తుంది. అసలువీరి మధ్య గొడవ ఏంటి.. హీరోహీరోయిన్లు చివరికి కుటుంబాలను కలిపారా..? అన్ని మంచి శకునములే అని పెద్దవారు ఎందుకు అంటారు..? అనేది అంతా సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఈ సినిమాలో ఉన్నవారంతా స్టార్ క్యాస్టింగ్ అని చెప్పుకోవాలి. రాజేంద్ర ప్రసాద్, నరేష్, రావు రమేష్, గౌతమీ, వాసుకి, వెన్నెల కిశోర్.. ఇలా చాలామంది నటించారు. మిక్కీ జె మేయర్ సంగీతం వినసొంపుగా ఉంది. ఈ సినిమా మే 18 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకోనున్నదో చూడాలి.