NTV Telugu Site icon

Commitment : ఎవరూ బలవంతం చేయరు.. సీనియర్ నటి షాకింగ్ కామెంట్స్

Annapurnamma

Annapurnamma

Commitment : టాలీవుడ్ లో కమిట్ మెంట్ మీద రకరకాల వాదనలు వినిపిస్తూనే ఉంటాయి. మీటూ ఉద్యమం తర్వాత చాలా మంది నటీమణులు టాలీవుడ్ లో కమిట్ మెంట్ అడిగారని కామెంట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా అన్నపూర్ణమ్మ చేసిన కామెంట్లు సంచలనం రేపుతున్నాయి. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఆమె ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ఆమె మాట్లాడుతూ.. ఇండస్ట్రీ గురించి ఈ నడుమ ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడుతున్నారన్నారు.

Read Also : Sridevi : ‘కోర్టు’ మూవీ హీరోయిన్ జాబిలి బ్యాక్ గ్రౌండ్ ఇదే..

“ఇండస్ట్రీలో ఎవరినీ బలవంతం చేయరు. అది వారి ఇష్టంగానే జరుగుతుంది. ట్యాలెంట్ ఉన్న వాళ్లకు అవకాశాలు రావనేది నేను నమ్మను. ఏదో మీడియాలో హైలెట్ కావడానికే కొందరు అలాంటి కామెంట్లు చేస్తున్నారనిపిస్తోంది. ఇండస్ట్రీ మనందరిది. దాన్ని కరెక్టుగా వినియోగించుకుంటే మంచి అవకాశాలు వస్తాయి” అంటూ ఆమె చెప్పుకొచ్చారు. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ నడుమ అన్నపూర్ణమ్మ ఇంటర్వ్యూలలో చేస్తున్న కామెంట్లు ఆసక్తిరేపుతున్నాయి.