Site icon NTV Telugu

RRR: ‘ఆర్ఆర్ఆర్’ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన థియేటర్స్.. కాలు కదిపితే ఖతమే

annapurna complex

annapurna complex

తమ అభిమాన హీరో సినిమా వస్తుంది అంటే అభిమానులకు పండగే.. థియేటర్లను పూలతో లకరించడం దగ్గర నుంచి కటౌట్స్, ప్లెక్సీలు, పాలాభిషేకాలు, పూలు, దండాలు.. అబ్బో మామూలు హడావిడి ఉండదు. ఇక మొదటి రోజు మొదటి షోలో ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. డాన్స్ లు, ఈలలు, గోలలు, పేపర్లు బట్టలు చించేసుకుంటారు అంటే అతిశయోక్తి కాదు.కొన్ని థియేటర్లలో అభిమానుల రచ్చకు థియేటర్ల తెరలు చిరిగిపోయాయి, కుర్చీలు విరిగిపోయాయి . ఇక ఇవన్నీ థియేటర్ల యజమానులకు నష్టాన్ని చేకూర్చేవే.. స్టార్ హీరో సినిమాకే ఇంత రచ్చ చేస్తే ఇద్దరు స్టార్ హీరోలు ఒకేసారి ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే ఇద్దరు హీరోల అభిమానుల రచ్చ ఊహకు అందని విధంగా ఉంటుంది. అదే మార్చి 25 న జరగబోతుంది.

ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ థియేటర్లలోచేసే హంగామా మాములుగా ఉండదు. అది ఊహించుకొనే భయపడ్డారేమో థియేటర్ల ఓనర్లు.. ప్రేక్షకులకే షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకున్నారు. ఈసారి తమ థియేటర్లను ఫ్యాన్స్ నుంచి కాపాడుకోవాలని గట్టి ప్లాన్ నే వేశారు. స్క్రీన్ వద్దకు ఫ్యాన్స్ ఎవ్వరు రాకుండా మేకులను అమర్చారు. ఇంకోచోట స్క్రీన్ చుట్టూ ఫెన్సింగ్ వేశారు. విజయవాడలోని అన్నపూర్ణ థియేటర్ మేకులతో, ఫెన్సింగ్ తో దర్శనమిచ్చింది. ఇక దీన్ని చూసిన అభిమానులు షాక్ అయ్యారు. డాన్స్ లు, గోలలు లేకుండా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడడం, అందులోను ఆర్ఆర్ఆర్ మూవీని సైలెంట్ గా చూడడం అంటే నరకం.. ఇలా చేయడమేంటి అంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి మార్చి 25 న అభిమానులు ఈ థియేటర్లో ఎలా సినిమా చూస్తారో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Exit mobile version