సూపర్ స్టార్ రజనీకాంత్ ‘అన్నాత్తే’ సినిమా టైటిల్ ప్రకటించినప్పటికీ నుంచి ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్ వరకు అభిమానుల్లో, సినీ ప్రియుల్లో భారీ అంచనాలను రేకెత్తించింది. కాగా ఈ సినిమా ఒక్క ఇండియాలోనే కాకుండా విదేశాలలో కూడా భారీ స్థాయిలో విడుదల అవుతుంది. దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఓవర్సీస్‌లో 1100 థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని నిర్మించిన సన్ పిక్చర్స్ ఒక తమిళ చిత్రానికి ఇదే అతిపెద్ద ఓవర్సీస్ విడుదల అని పేర్కొంది. ఒక్క అమెరికాలోనే 677 థియేటర్లలో ‘అన్నాత్తే’ రిలీజ్ అవుతోందని ప్రొడక్షన్ హౌస్ ఒక ట్వీట్‌లో తెలిపింది. భారీ సంఖ్యలో భారతీయులు ఉన్న యూఏఈలో ఈ చిత్రం 117 స్క్రీన్లలో విడుదల కానుంది. మలేషియాలో 110 థియేటర్లలో, సింగపూర్‌లో 23 థియేటర్లలో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. శ్రీలంకలో 86 స్క్రీన్లలో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు.
Read Also : రష్మిక మందన్న ‘మిషన్ మజ్ను’ రిలీజ్ డేట్ ఫిక్స్
శివ దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కెనడాలో 17 థియేటర్లలో, యునైటెడ్ కింగ్‌డమ్‌లో 35 థియేటర్లలో విడుదల కానుంది. యూరప్‌లో 43 థియేటర్లలో, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో 85 థియేటర్లలో విడుదల కానుంది. సినిమా విడుదలకు మరో రోజు మాత్రమే ఉండడంతో రజినీ అభిమానుల్లో నిమిష నిమిషానికీ ఉత్కంఠ పెరుగుతోంది. రజనీకాంత్‌తో పాటు నయనతార, ఖుష్బు, మీనా, కీర్తి సురేష్, జగపతి బాబు తదితరులు నటించిన ఈ చిత్రానికి ఇమ్మాన్ సంగీతం అందించారు.
