Site icon NTV Telugu

Anna Lezhneva : శ్రీవారికి తలనీలాలు సమర్పించిన అన్నా లెజినోవా..

Anna Lezinova

Anna Lezinova

Anna Lezhneva : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ భార్య అన్నా లెజినోవా తిరుమలకు చేరుకున్నారు. వారి కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదం నుంచి కోలుకుంటున్నాడు. ఈ రోజు ఉదయమే ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్ కు చేరుకుంది. కొడుకు క్షేమంగా బయటపడటంతో మొక్కులు చెల్లించేందుకు అన్నా లెజినోవా తిరుమలకు చేరుకున్నారు. అక్కడ ముందుగా డిక్లరేషన్ మీద సంతకం పెట్టారు. ఆ తర్వాత వరాహ స్వామి దర్శనం చేసుకున్నారు. అటు నుంచి అటే సాధారణ భక్తురాలిగా కల్యాణ కట్టకు వెళ్లారు. అక్కడ తలనీలాలు సమర్పించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read Also : Karnataka: 5 ఏళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం, హత్య.. నిందితుడి ఎన్‌కౌంటర్..

రేపు ఉదయం సుప్రభాత సమయంలో ఆమె శ్రీవారిని దర్శించుకుంటారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేశారు అధికారులు. ఆ తర్వాత అన్నదానం కోసం విరాళం ప్రకటిస్తారు. అక్కడే అన్నదానం కూడా స్వీకరిస్తారు. ఆమెతో పాటు పిల్లలు కూడా వస్తారని ముందుగా ప్రచారం జరిగింది. కానీ ఆమె మాత్రమే దర్శనం కోసం వచ్చారు. సింగపూర్ లోని కిచెన్ స్కూల్ లో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అందులో మార్క్ శంకర్ గాయపడ్డాడు. కాళ్లు, చేతులకు గాయాలు అయ్యాయి. ఇప్పుడు పూర్తిగా కోలుకుంటున్నాడు.

Exit mobile version