NTV Telugu Site icon

Ankitha : ఆ సినిమా నిరాశ పరచడంతో సినిమాలకు దూరం అయ్యాను..

Whatsapp Image 2023 07 14 At 10.38.54 Am

Whatsapp Image 2023 07 14 At 10.38.54 Am

అంకిత.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు తన క్యూట్ లుక్స్ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.లాహిరి లాహిరి లాహిరిలో సినిమాతో ఇండస్ట్రీ లో అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ..ఆ తరువాత రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ సింహాద్రి సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించి మెప్పించింది ఈ భామ.. ఈ సినిమా భూమిక మెయిన్ హీరోయిన్ గా నటించగా మరో హీరోయిన్‌గా అంకిత నటించింది. సింహాద్రి సినిమాతో టాలీవుడ్ లో అంకిత బాగా పాపులర్ అయింది… ఆ తర్వాత టాలీవుడ్‌లో వరుస సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.. ధనలక్ష్మీ.. ఐ లవ్‌ యూ, ప్రేమలో పావని కల్యాణ్‌ వంటి చిత్రాల్లో కనిపించింది.అంతే కాకుండా నవదీప్‌ సరసన మనసు మాట వినదు అలాగే గోపీచంద్‌తో రారాజు, రవితేజతో ఖతర్నాక్‌ సినిమాల్లో కూడా నటించింది ఈ భామ. అయితే ఆ తర్వాత వచ్చిన విజయేంద్రవర్మ మూవీ తీవ్రంగా నిరాశ పరిచింది..అంకిత 2009 నుంచి చిత్ర పరిశ్రమకు దూరమయ్యారు.

అంకిత విశాల్‌ జగపతి అనే బిజినెస్‌మెన్‌ను 2016లో పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత ఈ దంపతులు యూఎస్‌లోని న్యూజెర్సీలో స్థిరపడ్డారు.ఈ దంపతులకు ఇద్దరు అబ్బాయిలు కూడా ఉన్నారు.ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అంకిత తాను సినిమాలకు ఎందుకు దూరమయిందో తెలిపింది..అంకిత మాట్లాడుతూ.. ‘విజయేంద్రవర్మ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. కానీ ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేదు.ఆ సినిమా విజయం సాధించి ఉంటే నేను చిత్ర పరిశ్రమ కొనసాగేదాన్ని.’ అని ఆమె తెలిపారు.చిత్ర పరిశ్రమలో సక్సెస్‌ ఉంటేనే కెరీర్‌ బాగుంటుందని ఆమె చెప్పుకొచ్చారు.అంతే కాకుండా ఆమె పలు ఆసక్తికర విషయాలను కూడా వెల్లడించారు. గతేడాది హీరో అల్లు అర్జున్‌ను కలిశానని చెప్పుకొచ్చారు. అలాగే ఎన్టీఆర్‌తో తను సోషల్‌ మీడియాలో టచ్‌లో ఉన్నానని తెలిపారు. మంచి ఛాన్స్ వస్తే సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు ఆమె తెలిపారు