Ankita Lokhande: తండ్రి పాడె మోసిన నటి.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ankita Lokhande: అంకితా లోఖండే.. ఈ పేరు చాలా మందికి తెలియకపోవచ్చు. అదే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ ప్రియురాలు అని చెప్పండి.. ఓ ఆమెనా పవిత్ర రిష్తా సీరియల్ నటి కదా అని చెప్పేస్తారు. అవును ఆమెనే అంకితా లోఖండే. సుశాంత్ చనిపోయిన తరువాత ఈమె పేరు బాగా పాపులర్ అయ్యింది. సుశాంత్ తో ఆరేళ్ళు ప్రేమలో ఉన్న అంకిత.. బ్రేకప్ చెప్పి మరొక వ్యక్తిని వివాహమాడింది. ఇక తాజాగా అంకిత ఇంత తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి శశికాంత్ లోఖండే శనివారం కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతోతో బాధపడుతున్న ఆయన నిన్న తుదిశ్వాస విడిచారు. ఇక తండ్రి మరణంతో అంకిత కుంగిపోయింది. నేడు శశికాంత్ లోఖండే అంత్యక్రియలు నిర్వహించారు. కూతురు అయిన అంకిత తండ్రి పాడేను మోస్తూ కనిపించింది.
Ananya Panday: స్టార్ హీరోతో ఎఫైర్.. పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్.. అబార్షన్ కూడా.. ?
Also Read
- Aadarsha Kutumbam : 'ఆదర్శ కుటుంబం' మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
రోడ్డుపై తండ్రి పాడెను మోస్తూ గుండెలు పగిలేలా ఏడుస్తున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక తండ్రి లేని లోటును ఉహించుకోలేని ఆమె భర్తను పట్టుకొని కన్నీరుమున్నీరుగా విలపించింది. ఇండస్ట్రీలో కెరీర్ మొదలుపెట్టినప్పుడు చేతులో డబ్బులు లేక, కనీసం రూమ్ రెంట్ కు కూడా కట్టుకోలేని స్థితిలో ఉన్నప్పుడు తన తండ్రే తనకు తెలియకుండా రూమ్ రెంట్ కట్టేసేవాడని, తాను ఇప్పుడు ఇలా ఉండడానికి కారణం తన తండ్రినే అని ఆమె ఎన్నోసార్లు తెలిపింది. ఇక అంకితను భర్త విక్కీ జైన్ ఓదార్చే ప్రయత్నం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో అభిమానులను కంటనీరు తెప్పిస్తోంది. ఇక అంకిత ప్రస్తుతం ఒక పక్క సీరియల్స్ తో పాటు సినిమాలు కూడా చేస్తోంది. రెండేళ్ల క్రితం విక్కీ జైన్ ను వివాహమాడిన ఆమె ప్రస్తుతం కొన్ని సీరియల్స్ లో నటిస్తోంది. సుశాంత్ తో ఆరేళ్ళ ప్రేమమర్చిపోలేనిది అని, అతని మరణం తనను తీవ్రంగా బాధించిందని అంకిత చెప్పుకొచ్చింది.
తాజావార్తలు
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
-
Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!