NTV Telugu Site icon

Ankita Lokhande: తండ్రి పాడె మోసిన నటి.. వీడియో వైరల్

Ankitha

Ankitha

Ankita Lokhande: అంకితా లోఖండే.. ఈ పేరు చాలా మందికి తెలియకపోవచ్చు. అదే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ ప్రియురాలు అని చెప్పండి.. ఓ ఆమెనా పవిత్ర రిష్తా సీరియల్ నటి కదా అని చెప్పేస్తారు. అవును ఆమెనే అంకితా లోఖండే. సుశాంత్ చనిపోయిన తరువాత ఈమె పేరు బాగా పాపులర్ అయ్యింది. సుశాంత్ తో ఆరేళ్ళు ప్రేమలో ఉన్న అంకిత.. బ్రేకప్ చెప్పి మరొక వ్యక్తిని వివాహమాడింది. ఇక తాజాగా అంకిత ఇంత తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి శశికాంత్‌ లోఖండే శనివారం కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతోతో బాధపడుతున్న ఆయన నిన్న తుదిశ్వాస విడిచారు. ఇక తండ్రి మరణంతో అంకిత కుంగిపోయింది. నేడు శశికాంత్‌ లోఖండే అంత్యక్రియలు నిర్వహించారు. కూతురు అయిన అంకిత తండ్రి పాడేను మోస్తూ కనిపించింది.

Ananya Panday: స్టార్ హీరోతో ఎఫైర్.. పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్.. అబార్షన్ కూడా.. ?

రోడ్డుపై తండ్రి పాడెను మోస్తూ గుండెలు పగిలేలా ఏడుస్తున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక తండ్రి లేని లోటును ఉహించుకోలేని ఆమె భర్తను పట్టుకొని కన్నీరుమున్నీరుగా విలపించింది. ఇండస్ట్రీలో కెరీర్ మొదలుపెట్టినప్పుడు చేతులో డబ్బులు లేక, కనీసం రూమ్ రెంట్ కు కూడా కట్టుకోలేని స్థితిలో ఉన్నప్పుడు తన తండ్రే తనకు తెలియకుండా రూమ్ రెంట్ కట్టేసేవాడని, తాను ఇప్పుడు ఇలా ఉండడానికి కారణం తన తండ్రినే అని ఆమె ఎన్నోసార్లు తెలిపింది. ఇక అంకితను భర్త విక్కీ జైన్‌ ఓదార్చే ప్రయత్నం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో అభిమానులను కంటనీరు తెప్పిస్తోంది. ఇక అంకిత ప్రస్తుతం ఒక పక్క సీరియల్స్ తో పాటు సినిమాలు కూడా చేస్తోంది. రెండేళ్ల క్రితం విక్కీ జైన్‌ ను వివాహమాడిన ఆమె ప్రస్తుతం కొన్ని సీరియల్స్ లో నటిస్తోంది. సుశాంత్ తో ఆరేళ్ళ ప్రేమమర్చిపోలేనిది అని, అతని మరణం తనను తీవ్రంగా బాధించిందని అంకిత చెప్పుకొచ్చింది.

Show comments