తెలుగు హీరోయిన్లలో ఒకరైన అంజలి పెళ్లి గురించి అనేక వార్తలు ప్రచారంలో కి వస్తున్నాయి.. అయితే ఏజ్ పెరుగుతున్నా అంజలి మాత్రం పెళ్లికి దూరంగా ఉన్నారనే విషయం తెలిసిందే.తాజాగా అంజలి పెళ్లి గురించి మరో సారి సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్నాయి. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా అంజలి నటిస్తున్న విషయం తెలిసిందే.వయస్సు పెరుగుతున్నా అంజలికి ఆఫర్లు కూడా పెరుగుతున్నాయి.పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో కూడా నటించిన ఈ బ్యూటీ ఆ సినిమాల ద్వారా కూడా మంచి గుర్తింపు సంపాదించారు .వెబ్ సిరీస్ లలో అలాగే స్పెషల్ సాంగ్స్ లో కూడా నటిస్తూ అంజలి మంచి గుర్తింపు సొంతం చేసుకుంటున్నారు. అయితే తమిళ నటుడి జైతో అంజలి ప్రేమలో ఉన్నట్టు పెళ్లి చేసుకోనున్నట్టు గతంలో వార్తలు కూడా తెగ ప్రచారంలోకి వచ్చాయి. ప్రస్తుతం అంజలి హైదరాబాద్ లో అయితే ఉన్నారు.
తాజాగా అంజలి కి పెళ్లి గురించి ప్రశ్నలు బాగా ఎదురు అవుతున్నాయి.ఆ ప్రశ్నల గురించి అంజలి స్పందిస్తూ ఏ రిలేషన్ షిప్ లో అయినా రెస్పెక్ట్ అనేది చాలా ముఖ్యం అని చెప్పుకొచ్చారు. రెస్పెక్ట్ తర్వాతే లవ్ అనేవి ముఖ్యం అని ఈ బ్యూటీ కామెంట్లు చేసింది. రెస్పెక్ట్ లేని వ్యక్తి తో సంబంధం అనేది అనవసరం అని ఆమె అభిప్రాయం వ్యక్తం చేయడం విశేషం.జై తనకు రెస్పెక్ట్ ఇవ్వకపోవడం వల్లే అతని తో విడిపోయానని అయితే ఈ బ్యూటీ చెప్పినట్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.. కెరీర్ అలాగే రిలేషన్ షిప్ లలో ఏది ముఖ్యమనే ప్రశ్నకు ఈ బ్యూటీ స్పందిస్తూ రెండూ కూడా ముఖ్యమని చెప్పుకొచ్చింది.. వరుసగా విజయాల ను సొంతం చేసుకునే విధంగా ఈ బ్యూటీ తన కెరీర్ ను బాగా ప్లాన్ చేసుకుంటున్నారు. గేమ్ ఛేంజర్ సినిమాలో అంజలి ముఖ్య పాత్ర లో నటిస్తున్న విషయం తెలిసిందే..
