Site icon NTV Telugu

“ఆర్సీ 15″లో వకీల్ సాబ్ బ్యూటీ

Actress Anjali Birth Day Special

“ఆర్ఆర్ఆర్” తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించనున్న చిత్రం “ఆర్సి15”. ఈ చిత్రంలో హీరోయిన్ గా ఇప్పటికే కీసర అద్వానీని హీరోయిన్ గా ప్రకటిచారు. “భరత్ అనే నేను”, “వినయ విధేయ రామ” తర్వాత ఆమె చేస్తున్న మూడో తెలుగు ప్రాజెక్ట్ ఇది. ఇప్పుడు “వకీల్ సాబ్” బ్యూటీ కూడా ఇందులో హీరోయిన్ గా నటించబోతోంది అంటున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రెండవ మహిళా కథానాయికగా నటించడానికి శంకర్ అంజలిని సంప్రదించారని తెలుస్తోంది.

Read Also : వైరల్ పిక్స్: మందు గ్లాస్ తో భూమిక

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, శృతి హాసన్ నటించిన కోర్ట్ రూమ్ డ్రామా “వకీల్ సాబ్‌”తో అంజలి పునరాగమనం ఆకట్టుకుంది. ఈ మూవీ టాలీవుడ్‌లో ఆమెకు మరిన్ని అవకాశాలను అందించింది. “ఆర్సీ15” రెగ్యులర్ షూట్ సెప్టెంబర్ నెల నుండి ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో మిగిలిన నటీనటులు, సిబ్బంది త్వరలో ఖరారు చేయబడతారు. ఈ సినిమా ఏకకాలంలో తెలుగు, తమిళం, హిందీలో రూపొందించబడుతుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్‌ కి థమన్ సంగీతం అందించనున్నారు.

Exit mobile version