Anjali Arora Talks About Her Leaked MMS Video: సోషల్ మీడియా పుణ్యమా అని చాలామంది షార్ట్ వీడియోస్ చేస్తూ.. రాత్రికిరాత్రే స్టార్లు అవుతున్నారు. అలాంటి వారిలో అంజలి అరోరా ఒకరు. ‘కచ్చా బాదమ్’ పాటకు ఈమె చేసిన రీల్ నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవ్వడంతో.. అమ్మడు ఓవర్‌నైట్ స్టార్ అయిపోయింది. ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన లాకప్ షోలో పాల్గొనే స్థాయికి ఎదిగిపోయింది. ఇక ఆ షోలో పాల్గొన్నాక అంజలికి మరింత పాపులారిటీ వచ్చిపడింది. కొన్ని ప్రైవేట్ వీడియో సాంగ్స్‌లో కూడా నటించింది.
ఇలా పాపులారిటీ రావడం పట్ల కొందరు జీర్ణించుకోలేరు. అలాంటప్పుడు వారి ఇమేజ్‌ని దెబ్బతీసేందుకు అదే సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని, తప్పుడు మార్గాల్ని అనుసరిస్తుంటారు. అంజలి విషయంలోనూ అదే జరిగింది. ఈమె పబ్లిక్ ఫిగర్ అవ్వడం ఎవరికి నచ్చలేదో ఏమో తెలీదు కానీ.. ఎమ్ఎమ్ఎస్ పేరిట ఒక ఫేక్ బూతు వీడియోని నెట్టింట్లో లీక్ చేశారు. అందులో అంజలి ఫేస్ క్లియర్‌గా కనిపించడం, ఆమెతో పాటు సన్నిహితంగా ఉన్న వ్యక్తే ఆ వీడియోలో ఉండటంతో.. ఆ వీడియో నిజమేనని అంతా అనుకున్నారు. కానీ.. అందులో ఏమాత్రం వాస్తవం లేదని, అదొక ఫేక్ వీడియో అని అంజలి క్లారిటీ ఇచ్చింది. ఆ వీడియోని ఎవరు? ఎందుకు? సృష్టించారో అర్థం కావడం లేదని, అది తనని తీవ్రంగా కలచి వేసిందని ఆ అమ్మడు ఎమోషనల్ అయ్యింది.
ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘ఆ వీడియోలో ఉన్నది నేను కాదు. అసలు నాకు సంబంధం లేని వీడియోకి నా పేరు జత చేసి ఎందుకిలా చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఆ వీడియోలో నా ఫోటో అతికించి, కావాలనే వైరల్ చేస్తున్నారు. నన్ను ఈ స్థాయికి తెచ్చిన ప్రేక్షకులకు నన్నిప్పుడు దారుణంగా తిడుతున్నారు. నాకూ ఓ ఫ్యామిలీ ఉంది, మా ఇంట్లో వాళ్లు కూడా ఆ వీడియోలు చూస్తారని కనీసం ఆలోచించకుండా ఈ చర్యలకి పాల్పడటం నిజంగా దారుణం. కేవలం యూట్యూబ్‌లో వ్యూస్ కోసమే పనికిమాలిన వీడియోలు చేస్తున్నారు. ఇలాంటివన్నీ తట్టుకోగలిగే శక్తి నాకు లేదు’’ అంటూ అంజలి కన్నీరు పెట్టుకుంది.