NTV Telugu Site icon

Anjala Zaveri: ఏయ్.. వెంకీ హీరోయిన్.. చిరు విలన్ భార్యనా..?

Anjala

Anjala

Anjala Zaveri: ప్రేమించుకుందాం రా.. సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ముద్దుగుమ్మ అంజలా జావేరి. మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకొని గృహిణిగా సెటిల్ అయిపోయింది అంజలా.. ఆ తరువాత అమ్మడి గురించి ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. ఇక పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకుని 2012లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి ఔరా అనిపించింది. అప్పటికీ ఆమె వన్నె తగ్గని అందం ఎంతోమందిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ సినిమా తరువాత అడపాదడపా సినిమాల్లో కనిపిస్తున్న అంజలా.. పెళ్లి చేసుకున్నది ఎవరిని అనేది అప్పట్లో మిస్టరీగా ఉన్నా.. ఇప్పుడు మాత్రం ఆమె భర్త తెలుగువారికి కూడా సుపరిచితమే.

Chiranjeevi: బ్రేకింగ్.. చిరంజీవి సినిమా సెట్ లో అగ్నిప్రమాదం

నిజం చెప్పాలంటే ఆమె భర్త ఒక నటుడు అని, ఆ నటుడు టాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడని చాలా తక్కువ మందికి తెలుసు. ఆయన ఎవరో కాదు తరుణ్ అరోరా.. అదేనండీ.. చిరంజీవి రీ ఎంట్రీ చిత్రం ఖైదీ నంబర్ 150 విలన్.. ఒక్క చిరుకు మాత్రమే కాదు చాలా మంది కుర్ర హీరోలకు సార్థం తరుణ్ దీటైన విలన్ గా కనిపించి మెప్పించాడు. అల్ట్రా స్టైలిష్ విలన్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. తరుణ్ భార్య అంజలా అని తెలుగువారికి తెలియడం చాలా కష్టమని చెప్పాలి. ఇక ఈ వాలెంటెన్స్ డే రోజున తరుణ్, అంజలా జావేరి ఫోటోను షేర్ చేసి షాక్ ఇచ్చాడు. ఇప్పటికీ అంజలా అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Show comments