NTV Telugu Site icon

Anirudh Ravichandran: ఏం తాగి కొడుతున్నావయ్యా.. మ్యూజిక్.. మెంటల్ ఎక్కిపోతుంది థియేటర్ అంతా

Anirudh

Anirudh

Anirudh Ravichandran: అనిరుధ్ రవిచంద్రన్.. మ్యూజిక్ సెన్సేషన్. ఇప్పుడు ఎక్కడ విన్నా కూడా మనోడి పేరే వినిపిస్తుంది. అనిరుధ్ మ్యూజిక్ లో ఏదో ముఅజిక్ ఉంటుంది. కథ ఎలాంటి అయినా కూడా అనిరుధ్ తన మ్యూజిక్ తో వేరే లెవెల్ కు తీసుకెళ్తాడు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ధనుష్ నటించిన 3 సినిమాతో అనిరుధ్ ఎంట్రీ ఇచ్చాడు. వై దిస్ కొలవెరి అంటూ మ్యూజిక్ లవర్స్ ను పిచ్చివాళ్లను చేశాడు. 3 ఆల్బమ్ ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమా తరువాత ఈ కుర్ర మ్యూజిక్ డైరెక్టర్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. స్టార్ హీరో సినిమా దగ్గరనుంచి కుర్ర హీరో వరకు అందరికి మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ నే కావాలి. ఇక తెలుగులో కూడా అనిరుధ్ తన మ్యూజిక్ తో మరిపించాడు. పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమాతో తెలుగుతెరకు పరిచయామయ్యాడు. ఆ తరువాత గ్యాంగ్ లీడర్, జెర్సీ సినిమాలకు అందించాడు. ఇక ఈ సినిమాలు అన్ని మ్యూజిక్ పరంగా హిట్ ను అందుకున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ గానే కాకుండా సింగర్ గా కూడా అనిరుధ్ బాగా ఫేమస్.

Mehar Ramesh: ఓ శక్తి.. ఓ షాడో.. ఓ భోళా.. స్టార్స్ కు ప్లాప్స్ ఇవ్వడంలో తోపు అంతే

ఇక ఇవన్నీ పక్కన పెడితే.. అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే వేరే లెవల్ అని చెప్పాలి. నిన్న రిలీజ్ అయిన జైలర్ సినిమాకు ప్రాణం రజినీ అయితే.. ఆత్మ అనిరుధ్ మ్యూజిక్ అని చెప్పాలి. అస్సలు రజినీ ఎలివేషన్స్ కు అనిరుధ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు థియేటర్ లో ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయారు. అంతలా మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు. సినిమా చూసినవాళ్లందరూ.. ఏం తాగి కొడుతున్నావయ్యా.. మ్యూజిక్.. మెంటల్ ఎక్కిపోతుంది థియేటర్ అంతా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా ప్రతి ఒక్క డైరెక్టర్ కోరుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్అనిరుధ్ మాత్రమే. ప్రస్తుతం మనోడి చేతిలో దాదాపు డజన్ సినిమాలు ఉన్నాయి. తెలుగులో దేవర, హిందీ లో జవాన్,లియో, ఇండియన్ 2, విడమూయురాచి, VD 12.. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది. మరి ఈ సినిమాలతో ఈ కుర్ర మ్యూజిక్ డైరెక్టర్ ఎలాంటి హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంటాడో చూడాలి.