Anirudh Ravichander Demanding Remuneration on equal with Heroes: ప్రస్తుతానికి తెలుగు సినీ దర్శక నిర్మాతలకు మ్యూజిక్ డైరెక్టర్ల కొరత తీవ్రంగా వెంటాడుతుంది. నిజానికి తమన్, దేవి శ్రీ ప్రసాద్ లాంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లతో పాటు కొందరు తక్కువ రమ్యునరేషన్ తీసుకుని చేసే మ్యూజిక్ డైరెక్టర్లు కూడా టాలీవుడ్ కి ఉన్నారు. కానీ ఇప్పుడు తమిళంలో స్టార్ క్రేజ్ తో దూసుకుపోతున్న అనిరుద్ రవిచందర్ ను తమ సినిమాల్లో తీసుకోమని స్టార్ హీరోలు, దర్శక నిర్మాతలను కోరుతున్నారట. అయితే తమిళంలో అనేక సూపర్ హిట్ సినిమాలు ఉండటంతో అనిరుద్ రవిచందర్ ఒక్కసారిగా భారీ ఎత్తున రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆయన తెలుగులో ప్రస్తుతానికి దేవర సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు, అలాగే మరో సినిమాకి కూడా మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక తెలుగులో ఆయనకు సినిమాకి మ్యూజిక్ అందించేందుకు తీసుకునే రెమ్యూనరేషన్ తో మన తెలుగు దర్శక నిర్మాతలు ఒక టైర్ 2 హీరోకి రెమ్యూనరేషన్ ఇచ్చేయొచ్చు అని తెలుస్తోంది.
Nandamuri Balakrishna: మనవడితో హాలిడేకు చెక్కేసిన బాలయ్య..
అంటే తెలుగులో టైర్ 2 హీరో తీసుకునే రెమ్యూనరేషన్ ని ఆయన ఒక సినిమాకి సంగీతం అందించేందుకు డిమాండ్ చేస్తున్నట్లు చెబుతున్నారు. అయినా సరే హీరోలు పట్టు పట్టారు కాబట్టి కచ్చితంగా ఆయననే తమ సినిమాల్లో మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవడానికి కూడా దర్శక నిర్మాతలు ఏమాత్రం వెనకాడడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతానికి తమన్ మంచి ఫాంలో ఉన్నా సరే ట్యూన్లు త్వరగా ఇవ్వకుండా ఏడిపిస్తున్నాడని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. ఆయనతో సినిమా చేయడం కంటే ఖర్చు ఎక్కువైనా నిజంగానే హీరో అడిగినట్టు అనిరుద్ రవిచంద్రన్ వంటి వారిని తీసుకోవడానికి ఏమాత్రం వెనకాడడం లేదని తెలుస్తోంది. ఇక మొత్తానికి తన క్రేజ్ ని ఏమాత్రం వెనుకడకుండా వాడుకునేందుకు అనిరుద్ రవిచంద్రన్ సిద్ధమయ్యాడని, ఈ తాజా రెమ్యూనరేషన్ వ్యవహారాలు తేటతెల్లం చేస్తున్నాయి. గతంలో కూడా అనిరుద్ రవిచంద్రన్ పలు తెలుగు సినిమాలకు సంగీతం అందించాడు. మ్యూజిక్ పరంగా తెలుగులో అవన్నీ సూపర్ హిట్ అయ్యాయి. భవిష్యత్తులో కూడా ఆయన మరిన్ని తెలుగు సినిమాలు చేసే అవకాశాలు అయితే ప్రస్తుతానికి కనిపిస్తున్నాయి.