Kingdom : విజయ్ దేవరకొండ నటించిన కింగ్ డమ్ మూవీకి వరుస కష్టాలు వస్తున్నాయి. ఇప్పటికే మే 30నుంచి జులై 4కు వాయిదా పడింది. ఇప్పుడు ఆ డేట్ కు కూడా రావట్లేదు. జులై 4 నుంచి పోస్ట్ పోయిన్ అయిపోయింది. దీనికి ఓ వ్యక్తి కారణం అని తెలుస్తోంది. అది కూడా విజయ్ ఏరికోరి తెచ్చుకున్న వాడే. అతనే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ అని ప్రచారం. అనిరుధ్ రీ రికార్డింగ్ పనులు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయంట.
Read Also : Nagababu : తల్లి ఆరోగ్యంపై స్పందించిన నాగబాబు..
రజినీకాంత్ నటించిన కూలీ సినిమాకు అతనే మ్యూజిక్ డైరెక్టర్. రెండు సినిమాల రీ రికార్డింగ్ పనులు పెండింగ్ లో ఉంటే.. ప్రస్తుతం కూలీ సినిమా పనుల్లోనే బిజీగా ఉంటున్నాడంట. తాను ముందే కూలీకి అగ్రిమెంట్ చేసుకున్నానని.. కాబట్టి కూలీ అయిపోయిన తర్వాత కింగ్ డమ్ పనులు చేస్తానని చెబుతున్నాడంట.
దాంతో కింగ్ డమ్ టీమ్ ఏమీ అనలేని పరిస్థితి వచ్చింది. ఎందుకంటే కింగ్ డమ్ కు రీ రికార్డింగ్ పనులతో పాటు కొంత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పెండింగ్ లో ఉంది. ఇవన్నీ అయిపోయిన తర్వాతనే మూవీ రిలీజ్ డేట్ ప్రకటిస్తారని సమాచారం అందుతోంది.
Read Also : Amitabh Bachchan : అందుకే ఐశ్వర్యను పొగడను.. అమితాబ్ షాకింగ్ కామెంట్స్
