సందీప్ రెడ్డి వంగ “A” రేటెడ్ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసే పనిలో ఉన్నాడు. సినిమా ఆడియన్స్ కి కనెక్ట్ అయితే చాలు సెన్సార్ నుంచి ఎలాంటి సర్టిఫికెట్ వచ్చినా సినిమాని ఆపలేవు అని నిరూపిస్తూ అనిమల్ మూవీ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. రణబీర్ కపూర్ ని అనిమల్ గా చూపిస్తూ సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన ఈ మూవీ 500 కోట్లు క్రాస్ చేసినా బాక్సాఫీస్ దగ్గర స్లో అవ్వట్లేదు. మండేకి అనిమల్ సినిమా స్లో అవుతుంది అనుకున్న వాళ్లకి షాక్ ఇస్తూ 40 కోట్లు కలెక్ట్ చేసింది. ఓవరాల్ గా ఇప్పటివరకు అనిమల్ మూవీ 527.6 కోట్లని కలెక్ట్ చేసిందని మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. నిన్న ఒక్క రోజే అనిమల్ సినిమా నాన్-హాలిడే రోజున అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా హిస్టరీ క్రియేట్ చేసింది. అనిమల్ సినిమా 27.8 కోట్లని గత 24 గంటల్లో వసూల్ చేసి కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది.
ఈ రోజు, రేపు తెలుగులో కొత్త సినిమాల విడుదల ఉంది కాబట్టి అనిమల్ తెలుగు కలెక్షన్స్ లో కాస్త డ్రాప్ కనిపించే అవకాశం ఉంది. నార్త్ బెల్ట్ అండ్ ఓవర్సీస్ లో మాత్రం అనిమల్ ర్యాంపేజ్ కంటిన్యూ అవ్వనుంది. రేపటి నుంచి వీకెండ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అనిమల్ కలెక్షన్స్ లో మళ్లీ సాలిడ్ గ్రోత్ కనిపించడం గ్యారెంటీ. ఇప్పట్లో స్లో అయ్యేలా కనిపించట్లేదు కాబట్టి అనిమల్ మూవీ కంప్లీట్ థియేట్రికల్ రన్ డిసెంబర్ 21 వరకూ ఉండే అవకాశం ఉంది. డంకీ, సలార్ సినిమాలు రిలీజ్ అయ్యే వరకూ అనిమల్ సినిమా థియేటర్స్ అండ్ బుకింగ్స్ కి వచ్చే నష్టం పెద్దగా ఉండకపోవచ్చు. సో ఓవరాల్ రన్ లో మంచి ఆక్యుపెన్సీని మైంటైన్ చేస్తే అనిమల్ సినిమా రణబీర్ కపూర్ కెరీర్ కే కాదు ఈ ఇయర్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలవడం గ్యారెంటీ.
#Animal Explosion Continues 🔥🪓#AnimalHuntBegins #BloodyBlockbusterAnimal #AnimalInCinemasNow #AnimalTheFilm #AnimalHuntBegins
Book Your Tickets 🎟️ https://t.co/kAvgndK34I#AnimalInCinemasNow #AnimalTheFilm @AnimalTheFilm @AnilKapoor #RanbirKapoor @iamRashmika… pic.twitter.com/bUGFLPhH1n
— Animal The Film (@AnimalTheFilm) December 7, 2023