NTV Telugu Site icon

Animal Film Controversy: బాలీవుడ్ స్టార్ రైటర్ కి సందీప్ వంగ దిమ్మతిరిగే సమాధానం

Sandeep Reddy Vanga

Sandeep Reddy Vanga

సందీప్ రెడ్డి వంగ… రామ్ గోపాల్ వర్మ తర్వాత బాలీవుడ్ కి వెళ్లి అక్కడ హిట్స్ ఇస్తున్న ఏకైక డైరెక్టర్. టిపికల్ స్టోరీ టెల్లింగ్, హార్డ్ హిట్టింగ్ సీన్స్, స్టన్నింగ్ ఫిల్మ్ మేకింగ్ తో సినిమాలు చేస్తున్న సందీప్ రెడ్డి వంగ, సినిమాలనే కాదు సమాధానాలని కూడా సాలిడ్ గా ఇస్తూ ఉంటాడు. తన సినిమాలకి ఎవరైనా అర్ధంలేని విమర్శలు చేస్తే సందీప్ రెడ్డి వంగ అసలు సైలెంట్ ఉండడు. క్రియేటివ్ క్రిటిసిజం యాక్సెప్ట్ చేసే సందీప్… తేడాగా మాట్లాడితే మాత్రం ఓపెన్ గానే ట్యాగ్ చేసి సమాధానం ఇస్తాడు. ఇంటర్వూస్, ట్వీట్స్ తో ఎప్పటికప్పుడు అదిరిపోయే సమాధానాలు ఇచ్చే సందీప్… లేటెస్ట్ గా స్టార్ రైటర్ జావేద్ అక్తర్ ని ట్యాగ్ చేసి దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చాడు. “ఒక అబ్బాయి, ఒక అమ్మాయిని తన బూట్లు నాకమని చెప్తున్నాడు… అమ్మాయిని కొడుతున్నాడు… ఆ సినిమా సూపర్ హిట్ కూడా అయ్యింది అంటే అలాంటి సినిమా చాలా డేంజర్” అంటూ బాలీవుడ్ స్టార్ రైటర్, లిరిసిస్ట్ జావేద్ అక్తర్ ఇటీవలే అనిమల్ సినిమా గురించి కామెంట్స్ చేసాడు.

జావేద్ అక్తర్ కామెంట్స్ కి రెస్పాండ్ అవుతూ… అనిమల్ మూవీ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి “ఒక అబ్బాయి, ఒక అమ్మాయిని మోసం చేసినప్పుడు… ఆ అమ్మాయి అబ్బాయిని తన బూట్లు నాకమని చెప్తే మీరంతా ఫెమినిజం పేరుతో చప్పట్లు కొడతారు. ప్రేమకి జెండర్ పాలిటిక్స్ ని తీసుకోని రాకండి. ఇద్దరు ప్రేమకులు ఉన్నారు, ఒకరు ఇంకొకరిని చీట్ చేసారు… కోపం వచ్చిన వ్యక్తి బూట్లు నాకమని చెప్పాడు అంతే… జోయా, రన్విజయ్ మధ్య జరిగింది ఇలానే చూడాలి అని మీ అంత క్యాలిబర్ ఉన్న రైటర్ కూడా తెలుసుకోలేకపోతున్నాడు అంటే మీరు ఇన్ని రోజులు రాసింది అంతా అబద్దమే” అంటూ రిప్లై వచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జావేద్ అక్తర్ నే అన్నాడు అంటూ బాలీవుడ్ మీడియా సందీప్ గురించి మాట్లాడుకుంటుంది. అంజాజ్, జంజీర్, యాదొంకి బారత్, దీవార్, షోలే, డాన్, కాలా పత్తర్, మిస్టర్ ఇండియా లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలకి జావేద్ అక్తర్ రైటర్. Z