NTV Telugu Site icon

Animal: జవాన్ కలెక్షన్స్ ని బీట్ చేసిన A రేటెడ్ సినిమా…

Animal Collections

Animal Collections

సందీప్ రెడ్డి వంగ లేటెస్ట్ సెన్సేషనల్ ఫిల్మ్ అనిమల్ బాక్సాఫీస్ ని రఫ్ఫాడిస్తోంది. రణబీర్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమా డిసెంబర్ 1న రిలీజై డ్రై సీజన్ లో కూడా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. మూడో వారంలో కూడా స్ట్రాంగ్ హోల్డ్ ని మైంటైన్ చేస్తూ అనిమల్ సినిమా 835.9 కోట్లని కలెక్ట్ చేసి 850 కోట్ల మార్క్ చేరువలో ఉంది. ఒక A రేటెడ్ సినిమా, మూడున్నర గంటల నిడివితో రిలీజై ఈ రేంజ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడం ట్రేడ్ వర్గాలకి కూడా ఆశ్చర్యపరిచే విషయం. అనిమల్ హిట్ అవుతుంది అనుకున్నారు కానీ ఫైనల్ రన్ లో వెయ్యి కోట్లు కలెక్ట్ చేసే స్థాయి హిట్ అవుతుందని ఎవరు కలలో కూడా ఊహించి ఉండరు. డంకీ, సలార్ సినిమాల రిలీజ్ లతో అనిమల్ సినిమాకి మరో మూడు రోజులు మాత్రమే థియేట్రికల్ రన్ మిగిలింది.

ఈ మూడు రోజుల్లో అనిమల్ మూవీ ఎంత కలెక్షన్స్ రాబడుతుంది అనే దానిపైనే అనిమల్ ఫైనల్ గ్రాస్ డిపెండ్ అయ్యి ఉంది. వెయ్యి కోట్ల మార్క్ ని టచ్ చేస్తే మాత్రం అనిమల్ సినిమా కొత్త హిస్టరీ క్రియేట్ చేసినట్లే. ఇండియాలోనే కాదు ఓవర్సీస్ లో కూడా ర్యాంపేజ్ క్రియేట్ చేస్తున్న అనిమల్ సినిమా జవాన్ ఫైనల్ కలెక్షన్స్ ని బీట్ చేసి కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది. కెనడాలో షారుఖ్ సినిమాలకి సెన్సేషనల్ కలెక్షన్స్ వస్తుంటాయి. జవాన్ సినిమా ఈ సెంటర్ లో 5.2 మిలియన్స్ ని కలెక్ట్ చేసింది. ఈ కలెక్షన్స్ ని బీట్ చేసి అనిమల్ సినిమా 5.5 మిలియన్ డాలర్స్ కి చేరువలో ఉంది. అనిమల్ సినిమా ఇప్పుడు కెనడాలో హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఓవరాల్ గా యుఎస్ మార్కెట్ లో అనిమల్ సినిమా 15 మిలియన్ మార్క్ ని రీచ్ అవనుంది.

Show comments