Animal actor Manjot Singh saved a girl from committing suicide: రణబీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ సినిమా మీద అభిమానులు చాలా ప్రేమను కురిపించారు. ఈ దెబ్బతో సినిమా బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు బద్దలు కొడుతూ కలెక్షన్స్ వర్షం కురిపించింది. దీంతో యానిమల్ సినిమా 2023 సంవత్సరంలో అతిపెద్ద హిట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇక ‘యానిమల్’ సినిమా విడుదలై నెల రోజులకు పైగా గడిచినా ఆ సినిమాపై చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ అయిన మొదట్లో రణబీర్ కపూర్, రష్మిక మందన్న, తృప్తి దిమ్రీ టౌన్ ఆఫ్ టౌన్ గా మారగా ఇప్పుడు మంజోత్ సింగ్ కూడా టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు. రణబీర్ కపూర్ కజిన్ పాత్రలో నటించిన నటుడు మంజోత్ సింగ్ వీడియో వైరల్ అవుతోంది. మంజోత్ సింగ్ కి చెందిన ఒక పాత వీడియో సోషల్ మీడియాలో చాలా చర్చనీయాంశమైంది. ఈ వీడియో చూసిన జనాలు మంజోత్ సింగ్‌పై విపరీతంగా ప్రశంసలు కురిపిస్తున్నారు.
Nawazuddin Siddiqui: సైంధవ్ షూట్ లో నవాజుద్దీన్ సిద్దిఖీకి బోట్ ప్రమాదం?
మంజోత్ సింగ్ ‘యానిమల్’ సినిమాలో సోదరుడి కోసం ఫైట్ చేస్తూ కనిపించగా నిజ జీవితంలో అతను చాలా భిన్నంగా కనిపించదు. నోయిడాలోని శారదా యూనివర్సిటీలో బి.టెక్ చేసి ఆ తరువాత నటనా జీవితాన్ని ప్రారంభించారు. అక్కడే చదువుకుంటున్న సమయంలో, అతను 18 ఏళ్ల యువతిని ఆత్మహత్య చేసుకోకుండా అడ్డుకున్నాడు. సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోన్న వీడియో ఐదేళ్ల క్రితం నాటిదని చెబుతున్నారు. ఈ వీడియోలో ఒక అమ్మాయి భవనంపై నుండి దూకడానికి ప్రయత్నిస్తున్నట్లు చూడవచ్చు, కానీ మంజోత్ ఆమె ప్రాణాలను కాపాడాడు. ఇక ఆయన వీడియోను షేర్ చేస్తూ నెటిజన్లు నటుడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘యానిమల్’లో రణ్‌బీర్ కపూర్ మరియు రష్మిక మందన్నతో పాటు అనిల్ కపూర్, బాబీ డియోల్ మరియు తృప్తి దిమ్రీ ప్రధాన పాత్రలు పోషించారు.. రణ్‌బీర్ కపూర్ కజిన్ పాత్రలో మంజోత్ సింగ్ తెరపై నటించాడు.