Site icon NTV Telugu

Anil Ravipudi: హీరో ఎవరైనా సరే, కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గ్యారెంటీ!

Anil Ravipudi

Anil Ravipudi

టాలీవుడ్‌లో ప్రస్తుతం ఒకటే పేరు మారుమోగుతోంది, అదే అనిల్ రావిపూడి. కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఈ దర్శకుడు, తాజాగా మెగాస్టార్ చిరంజీవితో కలిసి చేసిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. అనిల్ రావిపూడి కెరీర్ గ్రాఫ్‌ను గమనిస్తే, ఆయన దర్శకుడిగా మారిన మొదటి సినిమా ‘పటాస్’ నుండి నేటి వరకు ప్రతి హీరోకి వారి కెరీర్ లోనే బిగ్గెస్ట్ గ్రాసర్‌ను అందించడం విశేషం. అనిల్ రావిపూడికి ఏవైనా భారీ బిరుదులు ఉండకపోవచ్చు కానీ, సగటు ప్రేక్షకుడికి ఏం కావాలో ఆయనకు బాగా తెలుసు, హీరో ఎవరైనా సరే, వారిలోని మాస్, కామెడీ యాంగిల్స్‌ను పర్ఫెక్ట్‌గా వెలికి తీయడంలో ఆయన సిద్ధహస్తుడు.

Also Read :Tollywood Sankranthi: టాలీవుడ్ చరిత్రలో ఎన్నడూ లేని రికార్డ్.. 5 సినిమాలు, 4 హిట్లు.. బాక్సాఫీస్ షేక్!

పటాస్ కళ్యాణ్ రామ్ కెరీర్‌కు ఊపిరి పోసింది. సుప్రీమ్ సాయి ధరమ్ తేజ్‌కు మాస్ ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది. రాజా ది గ్రేట్, రవితేజకు చాలా కాలం తర్వాత ఒక పక్కా కమర్షియల్ హిట్ ఇచ్చింది. F2, F3 sసంక్రాంతికి వస్తున్నాం & సరిలేరు నీకెవ్వరు: వెంకటేష్, మహేష్ బాబుల బాక్సాఫీస్ స్టామినాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. కేవలం ‘భగవంత్ కేసరి’ విషయంలో మాత్రమే కొంత వ్యత్యాసం కనిపించింది. ఆ సినిమా విడుదల సమయంలో ఉన్న ఆఫ్-సీజన్ మరియు కొన్ని బాహ్య కారకాల వల్ల అనుకున్న స్థాయి వసూళ్లు రాబట్టలేకపోయింది. అయినప్పటికీ, బాలయ్యను కొత్తగా చూపించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఇప్పుడు ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో అనిల్ మరోసారి తన పవర్ ఏంటో నిరూపించుకున్నారు, చిరంజీవిలోని వింటేజ్ కామెడీ టైమింగ్‌ను, గ్రేస్‌ను వాడుకుంటూ ఆయన మలిచిన ఈ చిత్రం కేవలం మూడు రోజుల్లోనే 152 కోట్ల గ్రాస్ వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. చిరంజీవి కెరీర్‌లోనే ఇది అతిపెద్ద బ్లాక్ బస్టర్‌గా నిలవబోతుందని ట్రేడ్ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

Also Read :Funky Release Date: ‘ఫంకీ’ కొత్త పోస్టర్.. వాలెంటైన్స్ వీకెండ్‌కు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

చిరంజీవి ఇమేజ్‌కు తగ్గట్టుగా కేవలం 25 రోజుల్లోనే అనిల్ ఈ కథను సిద్ధం చేయడం ఆయన పనితీరుకు నిదర్శనం. చిరంజీవిని మళ్ళీ ఆ పాత ‘శంకర్ దాదా’ తరహాలో సరదాగా చూస్తుంటే మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. టాలీవుడ్‌లో రాజమౌళి తర్వాత దాదాపు 100% సక్సెస్ రేట్ ఉన్న దర్శకుడిగా అనిల్ రావిపూడి రికార్డు సృష్టించారు. నిజానికి ఒక్కమాటలో చెప్పాలనే అనిల్ రావిపూడి దగ్గర అద్భుతమైన కాన్సెప్టులు లేకపోవచ్చు కానీ, ఆడియన్స్‌ను థియేటర్లో కూర్చోబెట్టే ‘ఎంటర్టైన్మెంట్’ మ్యాజిక్ మాత్రం పుష్కలంగా ఉంది. అదే ఆయన్ని మెగాస్టార్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అందించే స్థాయికి చేర్చింది.

Exit mobile version