NTV Telugu Site icon

Anil Kapoor: ఈయనకి ఇంకా మహేష్ మత్తు దిగినట్లు లేదు…

Anil Kapoor

Anil Kapoor

సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళి చీఫ్ గెస్టులుగా వచ్చిన అనిమల్ ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. బాలీవుడ్ వాళ్లకి ప్రీరిలీజ్ ఈవెంట్, ఫ్యాన్స్ మధ్యలో భారీ ఈవెంట్ లు లాంటివి అలవాటు లేదు. మీడియా ఇంటరాక్షన్స్, ఫ్యాన్స్ మీటింగ్ తప్ప ఒక భారీ ఈవెంట్ చేసి సినిమాని ప్రమోట్ చేయడం బాలీవుడ్ కి పెద్దగా తెలియదు. సౌత్ లో ఇది చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా తెలుగులో ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా చేస్తారు, ఈ అలవాటుని అనిమల్ చిత్ర యూనిట్ కి పరిచయం చేసాడు సందీప్ రెడ్డి వంగ. హైదరాబాద్ లో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ కి హ్యూజ్ క్రౌడ్ అటెండ్ అయ్యారు. రణబీర్, అనిల్ కపూర్, బాబీ డియోల్ తమ లైఫ్ లో అలాంటి ఈవెంట్ ని చూసి ఉండరు. మహేష్ బాబు ఫ్యాన్స్ ఈవెంట్ లో “జై బాబు” స్లొగన్స్ తో రచ్చ చేసారు.

మహేష్ ఫ్యాన్ బేస్ నార్త్ వాళ్లకి అర్ధం అయ్యింది అనిమల్ ప్రీరిలీజ్ ఈవెంట్ తో… ఈ ఈవెంట్ లో అనిల్ కపూర్ మహేష్ బాబుని స్టేజ్ పైకి పిలిచాడు. అనిల్ కపూర్, మహేష్ బాబు కలిసి చిన్న డాన్స్ స్టెప్ కూడా వేసాడు. ఈ సమయంలో ఈవెంట్ జరుగుతున్న ప్రాంతం అంతా మహేష్ బాబు నినాదంతో హోరెత్తింది. మహేష్ బాబు గురించి అనిల్ కపూర్ చాలా స్పెషల్ గా మాట్లాడాడు, తన మొదటి సినిమా తెలుగులోనే చేశాను అంటూ జ్ఞాపకాలని తేలుచుకున్నాడు. ఈవెంట్ జరిగి 48 గంటలు దాటుతున్నా అనిల్ కపూర్ ఇంకా మర్చిపోయినట్లు లేడు స్పెషల్ ట్వీట్ చేసి మహేష్ కి, ఫ్యాన్స్ కి, బాబు గారికి థ్యాంక్స్ చెప్పాడు.