Site icon NTV Telugu

Anikha: నేను కూడా మనిషినే.. అసభ్య కామెంట్స్ పై అనిఖా ఎమోషనల్

Anikha Surendran

Anikha Surendran

Anikha Surendran Responds on Bad Comments: బాలనటిగా పలు మలయాళ, తమిళ సినిమాల్లో నటించిన ఈ భామ బుట్ట బొమ్మ అనే సినిమాతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. సితార ఎంటర్టైన్మెంట్స్ సినిమా అయినా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమై అనిఖా కెరీర్ కు పెద్దగా ఉపయోగపడలేదు. అయితే ఆమె తమిళ, మలయాళంలో మాత్రం ఎదో ఒక సినిమా చేస్తూ ఆసక్తికరంగా వార్తల్లో నిలుస్తోంది. అజిత్ నటించిన ఎన్నై అరిందాల్ – విశ్వాసం వంటి తమిళ చిత్రాలలో బాలనటి పాత్రలో అనిఖా తమిళ్ లో మంచి పేరు సంపాదించింది. ఇక నామ్ రౌడీ థాన్, మృధన్ వంటి పలు చిత్రాల్లో కూడా ఆమె నటించారు. బాలతారగా నటిస్తోన్న అనిక ‘ఓ మై డార్లింగ్’ సినిమా ద్వారా హీరోయిన్‌గా మారింది.

Devara Fear Song : దేవర సాంగ్ వచ్చేసింది.. అనిరుథ్ అరిపించాడు మావా!

ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అయింది కానీ పెద్దగా ప్రేక్షకులకు ఎక్కలేదు. ప్రస్తుతం హిప్-హాప్ తమిళ ఆది నిర్మిస్తున్న పిటి సర్ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో ఆమె నటిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనిఖా సోషల్ మీడియాలో తనకు వస్తున్న బ్యాడ్ కామెంట్స్ గురించి స్పందించింది. ఇక చిత్రసీమలో నటీమణులు ఇలాంటివి పెద్ద ఎత్తున ఎదుర్కొంటున్నారని పేర్కొంది. ఆకర్షణీయంగా దుస్తులు ధరించడం నా వ్యక్తిగత ప్రాధాన్యత అని పేర్కొన్న ఆమె విమర్శలు అనేవి వస్తాయి, పోతాయని చెప్పుకొచ్చింది. ఇది జీవితంలో ఒక భాగం మాత్రమేనని ఆమె కామెంట్ చేసింది. ఇక మీరు ఎలాంటి దుస్తులు వేసుకున్నా తప్పుగా మాట్లాడతారని కూడా ఆమె చెప్పుకొచ్చింది. అయితే తన దుస్తుల విషయంలో కొన్ని తప్పుడు కామెంట్స్ నన్ను బాగా ప్రభావితం చేస్తాయని.. నేను కూడా మనిషినేనని అనిఖా ఎమోషనల్ అయింది.

Exit mobile version