టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా, ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ కాంబినేషన్‌పై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి కుతూహలం నెలకొంది. ఈ సినిమాను ప్రతిష్టాత్మక బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, పి. మహేశ్ బాబు (‘‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’’ ఫేమ్) దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో, హైటెక్ యాక్షన్ సీక్వెన్స్‌లతో తెరకెక్కుతున్న ఈ మూవీని నవంబర్ 28న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. ఇక తాజాగా .
Also Read : Meena : హీరో వద్దన్నా వినకుండా.. ఒక్కసారి హోటల్‌కు వచ్చి చాన్స్ ఇవ్వమని అడిగాడు: మీనా
మూవీ టీమ్ టైటిల్ ప్రోమోను విడుదల చేస్తూ సినిమాపై అంచనాలు మరింత పెంచింది. రామ్ ఎనర్జీ, స్టైల్, డైలాగ్ డెలివరీ ఈ ప్రోమోలో అదిరిపోయేలా ఉండడంతో అభిమానులు సోషల్ మీడియాలో సంబరాలు చేస్తున్నారు. ఇదే క్రమంలో చిత్రబృందం మరో సర్ప్రైజ్‌ను కూడా ఇచ్చింది. సినిమా నుంచి ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ సాంగ్ ప్రోమోను విడుదల చేస్తూ, పూర్తి పాటను ఈ బుధవారం రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించింది. టాక్ ప్రకారం, రామ్ ఈ సినిమాలో ఫుల్ మాస్ అవతారంలో కనిపించబోతున్నాడట. అందుకే అభిమానులు ఇప్పుడే “ఇది రామ్ కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్ అవుతుందనే” నమ్మకంతో ఉన్నారు.
