Sandeep Reddy Vanga win Dadasaheb Phalke International Film Festival Awards 2024: దాదాసాహెబ్ ఫాల్కే అంతర్జాతీయ చలనచిత్రోత్సవం అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు వేడుకలలో ఒకటి. దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2024 ఫిబ్రవరి 20, మంగళవారం నాడు జరిగింది. ఇక దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ లో బెస్ట్ యాక్టర్ గా బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ బెస్ట్ యాక్ట్రెస్ గా నయనతార అవార్డులు అందుకున్నారు. అట్లీ దర్శకత్వం వహించిన జవాన్ చిత్రంలో తమ అద్భుతమైన నటనకు ఇద్దరు అవార్డులను గెలుచుకున్నారు. DPIFF 2024లో యానిమల్ చిత్రానికి గానూ సందీప్ రెడ్డి వంగా ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నారు. ఈ సినిమాలో రణబీర్ కపూర్ కీలక పాత్రలో కనిపించాడు.
Prabhas-Boyapati : ప్రభాస్ -బోయపాటి కాంబోలో మూవీ?
యానిమల్ ప్రపంచ వ్యాప్తంగా రూ.900 కోట్ల కలెక్షన్లతో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అదే సమయంలో, బాబీ డియోల్ యానిమల్‌లో ప్రతికూల పాత్రకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించబడ్డాడు. సినిమాలో బాబీ చేసిన అద్భుతమైన నటన చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అయితే మిగతా అవార్డులు అన్నీ ఒక ఎత్తు అయితే యానిమల్ సినిమాకి వచ్చిన అవార్డులు చర్చనీయాంశం అయ్యాయి. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ అయిన కొత్తలో సినిమా మీద చాలా నెగటివిటీ వచ్చింది. ముఖ్యంగా సందీప్ డైరెక్షన్ ఏమాత్రం బాలేదని, స్త్రీలను అతను చూసే పద్దతి బాలేదు అంటూ ఇలా రకరకాల చర్చలు జరిగాయి. అయితే సినిమా రిలీజ్ కి ముందు కలెక్షన్స్ కొల్లగొడుతున్నాం అని చెప్పిన సందీప్ అలాగే ముందుకు వెళ్ళాడు. ఇక ఇపుడు అసలు ఏమాత్రం ఉహించని విధంగా బెస్ట్ డైరెక్టర్ అవార్డు కూడా అందుకుని మళ్ళీ చర్చనీయాంశమయ్యాడు. ఇక సందీప్ రెడ్డి తెలుగు వాడు అయినా దాదా సాహెబ్ ఫిలిం ఫెస్టివల్ అవార్డు అందుకోవడం గమనార్హం.