NTV Telugu Site icon

Tollywood Anchors: మాల్దీవుల్లో వెకేషన్స్.. అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది పాపలు

Anchors

Anchors

Tollywood Anchors: టైటిల్ చూడగానే.. ఎక్కడి నుంచి వస్తుంది.. సంపాదిస్తే వస్తుంది.. కష్టపడితే వస్తుంది అని చెప్పేయకండి. అందరు కష్టపడి సంపాదిస్తేనే డబ్బు వస్తుంది. కానీ, ఏడాదిలో నాలుగుసార్లు విదేశాల్లో వెకేషన్స్ కు వెళ్లేంత డబ్బ వస్తుందా..? అందులోనూ.. బుల్లితెరపై యాంకరింగ్ చేసే ముద్దుగుమ్మలకు.. అనేది కొంతమంది డౌట్. ప్రస్తుతం బుల్లితెరపై తిరుగులేని యాంకర్స్ గా కొనసాగుతున్నారు.. శ్రీముఖి, రష్మీ, విష్ణుప్రియ.. ఇలా ఇంకొంతమంది ఉన్నారు. ఇక వీరితో పాటు మరికొంతమంది ఫ్రెండ్స్.. సీరియల్స్ లో చిన్న చిన్న పాత్రలు చేస్తూనో..జబర్దస్త్ లో నటిస్తూనే కనిపించేవారు. ఇక ఈ మధ్యకాలంలో వారందరూ కూడా మాల్దీవ్స్, విదేశీ ట్రిప్పులు అంటూ ఎంజాయ్చేస్తున్నారు. చిన్న పార్టీ అయినా, బర్త్ డే అయినా, వెడ్డింగ్ అయినా బీచ్ ఒడ్డుకు చేరిపోతున్నారు.

సమ్మర్ వస్తే సమ్మర్ వెకేషన్ అని, ఇక సీజన్ వెకేషన్ అని, గోవా డైరీస్ అని, మాల్దీవ్స్, థాయ్ ల్యాండ్ అంటూ బీచ్ ఒడ్డుకు చేరి అందాల ఆరబోత చేస్తూ కనిపిస్తున్నారు. ఇలా ఏడాది మొత్తం వెకేషన్స్ కు ఖర్చుపెట్టేంత డబ్బు వాళ్లకు వస్తుందా అని నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ మధ్యకాలంలో హీరోయిన్లకు తగ్గట్లు యాంకరమ్మలు కూడా అందాల ఆరబోత చేయడంతో పాటు రెమ్యూనిరేషన్ లు కూడా బాగానే డిమాండ్ చేస్తున్నారట. అయితే ఇక్కడ అర్ధం కానీ విషయం ఏంటంటే.. ఒక హీరోయిన్ ఇండస్ట్రీకి పరిచయమై హిట్ కొడితే ఆమె రేంజ్ ఒకలా ఉంటుంది.. ప్లాప్ అయితే మరోలా ఉంటుంది. అది ఆమె నటించే సినిమాను బట్టి.. నిర్మాతలతో ఆమె మాట్లాడుకొనేదాన్ని బట్టి ఉంటుంది. కానీ, యాంకర్లకు అలా కాదు.. ఒకటే షో.. ఎపిసోడ్ కు ఇంత అని.. ఎన్నో రోజులు షో ఉంటే అన్ని రోజులు.. ఇక ఈవెంట్స్ ఎప్పుడో కానీ జరగవు.. నిత్యం ఈవెంట్స్, షోస్ చేసేవాళ్ళు తప్ప అంత డిమాండ్ కూడా చేయలేరు. ఇక ఆ ఈవెంట్స్ లో పాల్గొనడానికి కూడా చాలా పరిచయాలు కావాలి.

ఇక వారి మెయింటైనెన్స్ సరేసరి.. ఇవన్నీ కాకుండా వారు కుటుంబం.. అప్పులు, లోన్లు.. అని ఉంటే .. ఇలా వెకేషన్స్ కు వెళ్లేంత డబ్బు మిగులుతుందా..? అనేది అంతుచిక్కని ప్రశ్న. సరే ఎవరైనా స్పాన్సర్స్ ఉంటారా..? అంటే అది ఎవరు చెప్పలేరు. మరి ఈ ముద్దుగుమ్మలకు అంత డబ్బు ఎక్కడనుంచి వస్తుంది.. ఒక్కోసారి వారి రిచ్ లైఫ్ చూస్తే హీరోయిన్ల లైఫ్ కూడా ఈ రేంజ్ లో ఉండదేమో అనిపిస్తూ ఉంటుంది. సీరియల్ హీరోయిన్ దగ్గరనుంచి జబర్దస్త్ లో లేడీ కమెడియన్స్ వరకు అందరూ .. లగ్జరీ లైఫ్ స్టైల్ ని ఆస్వాదిస్తున్నారు. మరి ముందు ముందు ఈ ముద్దుగుమ్మలు హీరోయిన్లుగా మారినా ఆశ్చర్యం లేదని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు. అయితే.. కొన్నిరోజులు ఇండస్ట్రీలో ఉండాలంటే.. ఇలాంటివి చేయక తప్పదు.. లైమ్ లైట్ లో ఉండడం చాలా ముఖ్యం కదా అని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు.

Show comments