NTV Telugu Site icon

Anchor Suma: అయ్యో సుమకు ఏమైంది.. ఏంటా దెబ్బలు..?

Suma

Suma

Anchor Suma: యాంకర్ సుమ గురించి ప్రత్యేకమైన పరిచయ వాక్యాలు చెప్పనవసరం లేదు. ఆమె లేని టాలీవుడ్ ను ఊహించుకోవడం కష్టమనే చెప్పాలి. బుల్లితెర షోలు.. ప్రీ రిలీజ్ ఈవెంట్స్.. ఇంటర్వ్యూలు.. ఇలా ఒకటని చెప్పుకోవడానికి లేదు. ఎంత మలయాళీ భామ అయినా తెలుగు అబ్బాయిని ప్రేమించి పెళ్ళాడి..తెలుగింటి ఆడపడుచుగా మారి.. తెలుగమ్మాయిలకంటే ఎక్కువ తెలుగును కాచి వడబోసింది సుమ. ఇక స్టార్ హీరో ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే యాంకర్ ఎవరు అని చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ఇంటర్వ్యూ చేయకుండా ఏ స్టార్ హీరో సినిమా రిలీజ్ అవ్వదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అలుపుసొలుపు లేకుండా నిలబడి పనిచేసినా.. ఆమెలో ఇసుమంత అయినా టైడ్ నెస్ ను చూడలేం. అంత యాక్టివ్ గా ఉంటుంది. ఇక తాజాగా సుమ స్నేహితులతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేయడానికి.. యూరప్ వెళ్ళింది. రెండు రోజుల క్రితం కూడాఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు యాంకర్ గా సుమనే ఉండాల్సింది.. కానీ ఈ వెకేషన్ వలన ఆమె ప్లేస్ లో ఝాన్సీ చేసింది.

Chiranjeevi: చిరు లీక్స్.. కీర్తి సంగీత్ లో.. మెగాస్టార్ స్టెప్పులు

ఇక నిత్యం యూరప్ వెకేషన్ ట్రిప్ కు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. తాజాగా సుమ కాళ్లకు దెబ్బలు తగిలినట్లు చెప్పుకొచ్చింది. తన కాళ్ల వేళ్లకు బ్యాండెడ్ ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. ” ఇది సరదాకి మాత్రమే .. దయచేసి దీని నుంచి థంబ్ నెయిల్స్ తయారుచేయకండి. మమ్మీఫీడ్ పాదాలు.. నాకన్న తక్కువ వయస్సువారితో వెకేషన్ కు వచ్చి.. వారితో తిరగడానికి షూస్ వేసుకొంటే.. అవి కరిచాయి.. దానివల్లనే ఇలా దెబ్బలు తగిలాయి. ఇప్పుడు నాకు అర్ధమయ్యింది.. నన్ను మమ్మీ అని ఎందుకు పిలుస్తారో” అని చెప్పుకొచ్చింది. ఇక ఈ ఫోటోపై అభిమానులు తమదైన రీతిలో కామెంట్స్ పెడుతున్నారు. అంత బాధను అనుభవిస్తూ సరదాగా నవ్వుతూ అని చెప్తావ్ ఏంటి సుమక్క అని కొందరు.. షూస్ వేసుకోకపోతే చెప్పులు వేసుకోండి.. ముందు కాళ్లు జాగ్రత్త.. టేక్ కేర్ సుమ గారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Show comments