NTV Telugu Site icon

Anchor Suma: మీడియాపై నోరు జారిన సుమ.. రిపోర్టర్ దెబ్బకు లైవ్ లోనే క్షమాపణలు

Anchor Suma

Anchor Suma

Anchor Suma Says Sorry to her Comments about Media Persons: ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉంటూ తన పని తాను చూసుకునే యాంకర్ సుమ తాజాగా వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా శ్రీ లీల హీరోయిన్ గా ఆది కేశవ అనే సినిమా తెరకెక్కింది. శ్రీకాంత్ రెడ్డి అనే కొత్త దర్శకుడు దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా నవంబర్ మూడో తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ సినిమా పాటను పార్క్ హయత్ లో ఒక గ్రాండ్ ఈవెంట్ ఏర్పాటు చేసి రిలీజ్ చేశారు. అయితే ఈ ఈవెంట్ కి యాంకర్ గా సుమ వ్యవహరించింది. అయితే ఈ క్రమంలోనే యాంకరింగ్ చేస్తున్న నేపథ్యంలో సుమ మీడియా మీద పంచ్ వేస్తున్నానని భావిస్తూ ఒక జోక్ పేల్చారు. అయితే అది మిస్ ఫైర్ అయింది. ఆమె మాట్లాడింది ఏ మాత్రం కరెక్ట్ గా లేదంటూ మీడియా ప్రతినిధులు అక్కడికక్కడే ఆమెను అడిగేశారు. అసలు విషయం ఏమిటంటే సుమ ప్రోగ్రాం ప్రారంభించేందుకు కెమెరామెన్ల కోసం వెతుకుతున్నారు. ఆ సమయంలో ఒక్క కెమెరామెన్ మాత్రమే అందుబాటులో ఉండడంతో మేము పెట్టిన స్నాక్స్ భోజనాల లాగా తింటున్న వారందరూ వచ్చి ప్రోగ్రాం లైవ్ స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాను అంటూ ఆమె మీడియా కెమెరామెన్లను ఉద్దేశించి కామెంట్ చేసింది.

Pooja Hegde : ఖరీదైన కారు కొన్న బుట్టబొమ్మ.. ధర ఎంతో తెలుసా?

ఆమె సరదాగానే భావించి జోక్ వేసినా, మీడియా ప్రతినిధులకు మాత్రం కోపం తెప్పించింది. ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదంటూ యాంకర్ సుమకు తేల్చి చెప్పారు, ముందుగా మీతో మాట్లాడాలి అనుకుంటున్నాం అనగానే యాంకర్ సుమ తనకు ఆ విషయంలో పేమెంట్ ఇవ్వలేదని వెళ్లిపోబోతున్నానని అనడంతో వెంటనే మీడియా ప్రతినిధి ఒకరు కల్పించుకుని మీరు ఇలా మీడియా మీద జోకులు వేయడం కరెక్ట్ కాదని చెప్పుకొచ్చారు. అయితే కేవలం తాను జోక్ గా మాత్రమే అన్నానని తనకి ఎలాంటి దురుద్దేశం లేదని ఆమె చెప్పే ప్రయత్నం చేశారు. అయితే మేము ఈ విషయంలో చాలా బాధపడ్డాం అని అనడంతో అయితే సరే మీరు స్నాక్స్ భోజనాలు లాగా తినడం లేదు స్నాక్స్ లాగానే తింటున్నారు సరేనా అని మరోసారి కౌంటర్ వేసింది. ఇదిగో ఇలాంటివే వద్దనేది దయచేసి ఇకముందు ఇలాంటివి చేయకండి అంటూ మీడియా ప్రతినిధి పేర్కొనడం హాట్ టాపిక్ అయింది. ఇక తన మాటల వలన బాధ పడ్డవారికి ఈ క్రమంలో సుమ బహిరంగ క్షమాపణ చెప్పారు.