Site icon NTV Telugu

Anchor Suma: ఆ సీన్ చూసి ఏడ్చేశాను.. హిట్ సినిమాకి సుమ రివ్యూ వైరల్!

Anchor Suma

Anchor Suma

Anchor Suma Review on The Goat Life goes Viral: స్వతహాగా మలయాళీ అయినా సుమ తెలుగమ్మాయే అనే విషయం కూడా చాలా మందికి తెలియదు. అంతలా ఆమె తెలుగు వారికి దగ్గరైంది. తెలుగు వాడైన రాజీవ్ కనకాలను వివాహం చేసుకున్న ఆమె ఇక్కడే టాప్ యాంకర్ గా సెటిల్ అయిపొయింది. తాజాగా ఆమె తన సోషల్ మీడియాలో ఒక రివ్యూ షేర్ చేసింది. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నటించిన సర్వైవల్‌ థ్రిల్లర్‌ ‘ఆడు జీవితం’ (ది గోట్‌ లైఫ్‌) తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను సుమ తాజాగా చూశారట. దీంతో ఈ సినిమా తనకెంతో నచ్చిందని చెబుతూ దర్శకుడి ప్రతిభను మెచ్చుకున్నారు.

CM YS Jagan: 7 కిలోమీటర్ల మేర సీఎంతో పాటు కదిలిన జనప్రభంజనం

‘‘ఆడు జీవితం’ చూశా, నజీబ్‌ కథను చాలా వివరంగా మనసుని హత్తుకునేలా చాటి చెప్పారు. ఈ సినిమా దర్శకుడు బ్లెస్సీకి నా సెల్యూట్‌. పృథ్వీరాజ్‌.. పూర్తిగా బరువు తగ్గిపోయి, పక్కటెముకలు బయటకు కనిపించే సన్నివేశంలో మిమ్మల్ని చూసి నాకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి, సినిమా పట్ల మీకు ఉన్న ప్రేమ, నిబద్ధతకు ఇది నిదర్శనం’’ అంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో ఆమె రాసుకొచ్చారు. దీనితోపాటు సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్‌ల ‘టిల్లు స్క్వేర్‌’ కూడా ఆమె చూసినట్టు వెల్లడించారు. ఆ సినిమా అయితే ఆద్యంతం నవ్వులు పూయించిందని చెబుతూ టిల్లు స్క్వేర్ టీమ్‌ను మెచ్చుకున్నారు. జీవనోపాధిలో భాగంగా కొన్నేళ్ల క్రితం కేరళకు చెందిన నజీబ్‌ అనే వ్యక్తి రియాద్ వెళ్లి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోగా అతడి జీవితాన్ని ఆధారంగా చేసుకుని బెన్నీ డానియేల్‌ ‘గోట్‌ డేస్‌’ అనే నవలను రాశారు. దానిని ప్రామాణికంగా చేసుకుని బ్లెస్సీ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రసంశలు దక్కించుకుని ముందుకు దూసుకుపోతోంది.

Exit mobile version