NTV Telugu Site icon

Anchor Suma: గిన్నిస్ రికార్డ్ క్రియేట్ చేసిన సుమ తాత.. ఎందుకో తెలుసా?

Anchor Suma Grand Father

Anchor Suma Grand Father

Anchor Suma Grandfather P B Menon Guinness Record: టాలీవుడ్ యాంకర్ సుమ మలయాళీ అయినా తెలుగింటి కోడలుగా ఆమె తెలుగు అమ్మాయిల కంటే ఎక్కువ దగ్గరైంది. యాంకర్ గా ఒకపక్క టీవీ షోలు చేస్తూ మరో పక్క సినిమా ఈవెంట్స్ చేస్తూ అప్పుడప్పుడూ సినిమాలు నటిస్తూ యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఆల్ రౌండర్ గా దుమ్మురేపుతోంది. తాజాగా ఆమె తన తాతయ్య గురించి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ హాట్ టాపిక్ అయింది. సుమ తాత ఈ వయస్సులో ఓ రికార్డ్ క్రియేట చేశారనేది ఆ పోస్టు సారాంశం. తాత అంటే ఇంకెవరో కాదు సుమ అమ్మమ్మ గారి సోదరుడట.

Salaar: సలార్ స్పెషల్ నెంబర్ కోసం ‘డర్టీ గాళ్’

ఆయన పేరు పి బాలసుబ్రమణ్యన్ మీనన్ కాగా వయస్సు 98 ఏళ్ళు. ఈ వయసులో బాలసుబ్రమణ్యన్ అరుదైన గౌరవం అందుకున్నారు. బాలసుబ్రమణ్యన్ ఒక అడ్వకేట్. గత 73 ఏళ్లుగా ఆయన అడ్వకేట్ ప్రొఫెషన్ లో వర్క్ చేస్తూ వస్తున్నారు. ఇన్నాళ్ల లాంగ్ కెరీర్ కంప్లీట్ చేసుకున్న ఏకైక అడ్వకేట్ గా మీనన్ వరల్డ్ రికార్డు సృష్టించారు. దీంతో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులకి అప్లై చేయగా వారు పరీక్షించి ఆయనకు ఆ రివార్డు అందించారు. ఇక ఈ విషయాన్ని యాంకర్ సుమ ఎంతో గర్వంగా తన సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక సుమ కొడుకు రోషన్ హీరోగా మారుతున్న సంగతి తెలిసిందే. బబుల్ గమ్ అనే టైటిల్ తో తెరకెక్కిన సినిమాతో రోషన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.

Show comments